ఇటలీ మీడియాకు ఇంట‌ర్వ్యూలు ఇస్తున్న ప్ర‌భాస్

226
italian-government-thanked-prabhas

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ బాహుబ‌లి సినిమాతో త‌న స‌త్తాని ప్ర‌పంచ దేశాల‌కి చాటి చెప్పాడు.దీంతో అత‌నికి మ‌న‌దేశంలోనే కాదు విదేశాల‌లోను భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్ప‌డుతుంది. ర‌ష్యా,చైనా, జ‌పాన్ వంటి దేశాల‌లో ప్ర‌భాస్‌కు వీరాభిమానులున్నారు. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ న‌టిస్తున్న రాధేశ్యామ్‌తో పాటు మ‌రో రెండు సినిమాల కోసం అక్క‌డి అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

ప్ర‌స్తుతం ప్ర‌భాస్ న‌టిస్తున్న రాధేశ్యామ్ చిత్రం యూర‌ప్ బ్యాక్‌డ్రాప్‌లో షూటింగ్ జ‌రుపుకుంటుంది. క‌రోనా జాగ్ర‌త్త‌లు పాటిస్తూ శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం మ‌రి కొద్ది రోజుల‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం ఇటలీ ప్ర‌జ‌లు కూడా ఎంతో ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు. అక్క‌డి మీడియా కూడా రాధేశ్యామ్ షూటింగ్ ప‌రిస్థితుల‌ని వివ‌రిస్తూ క‌థ‌నాలు ప్ర‌సారం చేస్తుంది. మ‌రోవైపు ప్ర‌భాస్ ఇంట‌ర్వ్యూలు కూడా తీసుకుంటుంది.ఇది టాలీవుడ్ ఇండ‌స్ట్రీ గ‌ర్వించ‌ద‌గ్గ విష‌యం అని ప్ర‌భాస్ ఫ్యాన్స్ అభిప్రాయ‌ప‌డుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here