బిల్లా-రంగాగా ప‌వ‌న్-రానా..!

198
pawan-movie-with-chiru-title

1982లో చిరంజీవి, మోహన్ బాబు ప్ర‌ధాన పాత్ర‌ల‌లో వ‌చ్చిన క్లాసిక‌ల్ మూవీ బిల్లా-రంగా. ఈ చిత్రం అప్ప‌ట్లో భారీ విజ‌యం సాధించింది.ఇప్పుడు ఈ చిత్ర టైటిల్‌పై ప‌వ‌న్ క‌ళ్యాణ్ అండ్ టీం క‌న్నేసిన‌ట్టు తెలుస్తుంది. వ‌కీల్ సాబ్ చిత్రంతో రెండేళ్ళ త‌ర్వాత రీఎంట్రీ ఇచ్చిన ప‌వ‌న్ ప్ర‌స్తుతం క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం, హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. ద‌స‌రా సంద‌ర్భంగా సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బేన‌ర్‌లో మ‌రో చిత్రం చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

సాగ‌ర్ కే చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రం మలయాళం సూపర్‌హిట్ మూవీ ‘అయ్యప్పన్‌ కొషియమ్‌’కు రీమేక్‌ అని తెలుస్తోంది. ఈ సినిమాలో దగ్గుబాటి రానా కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రానికి బిల్లా రంగా టైటిల్ సరిగ్గా స‌రిపోతుంద‌ని, చిత్రంలో బిల్లాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రంగానా రానా న‌టిస్తార‌ని టాక్ న‌డుస్తుంది. రీసెంట్‌గా సోషల్‌మీడియాలో విడుదల చేసిన వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో ‘బిల్లా.. రంగా’ అంటూ వాయిస్ వినిపిస్తోంది. దీంతో ప‌వ‌న్ తాజా చిత్రానికి ఇదే టైటిల్ పెట్టి ఉంటార‌ని డిసైడ్ అయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here