తెలుగులో ఇప్పటి వరకు ఈమె నటించిన డైరెక్ట్ సినిమా రాలేదు. అయినా కూడా టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ మాళవిక మోహనన్. ఈమె నటించిన పలు తమిళ సినిమాలు తెలుగులో డబ్ కావడంతో ఈమెకు మంచి గుర్తింపు దక్కింది. తెలుగులో ఈమె ఎప్పుడు ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెల్సిందే. ప్రభాస్‌కు జోడీగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రాజాసాబ్ సినిమాతో మాళవిక మోహనన్ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న నేపథ్యంలో ముందు ముందు స్టార్ హీరోల సినిమాల్లోనూ ఈ అమ్మడికి ఛాన్స్ దక్కే అవకాశాలు ఉన్నాయంటూ సినీ వర్గాల అంచనా.
సోషల్ మీడియాలో ఈ అమ్మడు షేర్ చేసే ఫోటోల కారణంగా ఎప్పటికప్పుడు వైరల్ అవుతూ ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో స్కిన్ షో ఫోటోలతో పాటు, చీర కట్టు ఫోటోలు, రెగ్యులర్ వర్కౌట్ ఫోటోలు వీడియోలను మాళవిక మోహనన్ షేర్ చేస్తూ ఉంటుంది. మాళవిక ఎప్పుడు టైట్ డ్రెస్‌లో కనిపించినా ఆ ఫోటోలు నిమిషాల వ్యవదిలో వైరల్ కావడం మనం చూస్తూ ఉంటాం. సోషల్ మీడియాలో ఈమె మరోసారి వైరల్ అయ్యే విధంగా ఒక ఫోటోను షేర్ చేసింది. వర్కౌట్ తర్వాత దిగిన ఈ ఫోటోలో మాళవిక మోహనన్ అలసి పోయినట్లుగా ఉంది. తాను చాలా అలసి పోయాను అంటూ ఆ ఫోటో మీద మాళవిక మోహనన్ కామెంట్ కూడా రాసి పెట్టింది.
సెలబ్రెటీలు జిమ్‌లో గంటలు గంటలు వర్కౌట్‌లు చేస్తూ ఉంటారు. ఆ విషయాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఉంటారు. అయితే మాళవిక మోహనన్ మాత్రం తక్కువ సమయం జిమ్‌లో ఉన్నా చాలా నాజూకుగా సన్నగా అందంగా కనిపిస్తుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. స్పోర్ట్స్ బ్రా ధరించిన మాళవిక మోహనన్ పింక్ లోయర్ ధరించింది. వర్కౌట్ పూర్తి చేసిన తర్వాత సెల్ఫీ ని తీసుకుని సోషల్ మీడియాలో షేర్ చేసింది. వర్క్ తర్వాత నేను ఇలా టైడ్ అయ్యాను అంటూ ఈ ఫోటోకి మాళవిక కామెంట్ రాసి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తన అభిమానులకు, ఫాలోవర్స్‌కి షేర్ చేసింది.
ఇలాంటి అందమైన ఫోటోలను షేర్ చేయడం వల్లే మాళవిక మోహనన్‌కి ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 43.5 లక్షల ఫాలోవర్స్‌ను కలిగి ఉంది. ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా కాలం అయినా కూడా అదృష్టం కలిసి రాకపోవడతో మొదట్లో చిన్న సినిమాలు చేస్తూ వచ్చింది. ఈమధ్య కాలంలో మెల్ల మెల్లగా బాలీవుడ్‌లోనూ అడుగు పెట్టింది. ప్రభాస్‌తో చేస్తున్న రాజాసాబ్ సినిమా పాన్ ఇండియా రేంజ్లో హిట్ అయితే కచ్చితంగా మాళవిక మోహనన్ హిందీలోనూ ఆఫర్లు వరుసగా దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. తెలుగు, తమిళ్, హిందీ సినిమా భాషల్లో నటించేందుకు ఈ అమ్మడు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.