మోహన్ బాబు బౌన్సర్లు తాజాగా ఎఫ్ 5 అనే రెస్టారెంట్‌పై దాడిచేశారని ఆరోపించారు మంచు మనోజ్. తాజాగా ఆయన బౌన్సర్లు ఈ రెస్టారెంట్‌పై దాడి చేశారంటూ దానిని పరిశీలించడానికి వచ్చాడు మనోజ్. అక్కడ ప్రాంతంలోని ప్రజలంతా లోన్లు తీసుకొని హోటళ్లు, హాస్టళ్లు పెట్టుకొని వాటిపై వచ్చే ఆదాయంతో బ్రతుకుతున్నారని, అలాంటి వారిపై మోహన్ బాబు సిబ్బంది తరచూ దాడిచేస్తున్నారంటూ మరోసారి తండ్రి మోహన్ బాబుపై ఘోరమైన ఆరోపణలు చేశాడు మనోజ్. తను లేని సమయం చూసి ఈ రెస్టారెంట్‌పై దాడి జరిగిందని పేర్కొన్నాడు. అంతే కాకుండా ఇలాంటి అన్యాయాలకు తాను ఎదురుతిరగడం వల్ల దీనిని ఒక ఆస్తి గొడవలాగా మార్చారని బయటపెట్టాడు.
మోహన్ బాబు సిబ్బందిలో కీలక పాత్ర పోషించే హేమాద్రి నాయుడు, ఫోట్రాగ్రఫర్ మౌళి.. తరచుగా అక్కడి ప్రాంతంలోని బిజినెస్ జరుపుకుంటున్న వారిని కొట్టి, వారి నుండి డబ్బులు వసూళు చేస్తున్నారని తీవ్రమైన ఆరోపణలు చేశాడు మంచు మనోజ్. ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై బౌన్సర్లు కచ్చితంగా దాడి చేస్తారని అన్నాడు. అవన్నీ తనకు తెలియడం వల్లే తాను ఎదురు తిరిగి ప్రశ్నించానని, అలా ప్రశ్నించినందుకే తనపై కూడా అభాండాలు వేశారని వాపోయాడు. తను మాట వినకుండా వారి విషయాలు బయటికి లాగుతున్నందుకు భార్య, పిల్లలు, తల్లులను కూడా టార్గెట్ చేశారని చెప్పుకొచ్చాడు మంచు మనోజ్.
మోహన్ బాబు (Mohan Babu)తో, మంచు విష్ణు (Manchu Vishnu)తో తనకు జరుగుతుంది ఆస్తుల గొడవ కాదు అంటూ క్లారిటీ ఇచ్చాడు మంచు మనోజ్. వాళ్లు చేస్తున్న అన్యాయాలను ప్రశ్నిస్తున్నందుకు తాను తాగేసి వచ్చి ఆస్తి గురించి గొడవ చేస్తున్నాడని పుకార్లు పుట్టించారని బయటపెట్టాడు. తను చెప్తున్నా వినడం లేదని భార్య, పిల్లలను కూడా మధ్యలోకి లాగి లేడీస్‌ను టార్గెట్ చేసి బెదిరించాలని చూశారని తెలిపాడు. మనోజ్‌నే ఇబ్బంది పెడుతున్నారు ఇక మా పరిస్థితి ఏంటి అంటూ ఎమ్‌బీయూ యూనివర్సిటీ వద్ద అన్యాయం ఎదుర్కుంటున్న వాళ్లంతా సైలెంట్ అయిపోయారు. ఇది వారి స్ట్రాటజీ అని చెప్పాడు మనోజ్. ఇప్పటికే తెలంగాణలో మీడియా, పోలీసులు సహాయం చేశారు కాబట్టి అక్కడ బౌన్సర్ల ఆగడాలు కంట్రోల్ అయ్యాయని అన్నాడు.
ఇక ఈ గొడవ అంతా ఎమ్‌బీ యూనివర్సిటీ సమీపంలోని ఒక హోటల్ ధ్వంసం చేయడంతో మొదలయ్యింది. ఎఫ్ 5 అనే రెస్టారెంట్‌ను పీఆర్ఓ సతీష్‌తో యూనివర్సిటీ బాడీగార్డ్స్ కూడా కలిసి ధ్వంసం చేసినట్టుగా సీసీటీవీలో స్పష్టంగా రికార్డ్ అయ్యింది. ఇంతకు ముందు సతీష్ వేరు, ఇప్పుడు సతీష్ వేరు అంటూ తను దాడికి పాల్పడిన ఘటన మొత్తం సీసీటీవీలో స్పష్టంగా రికార్డ్ అవ్వడంతో మంచు మనోజ్ కూడా దీనిపై పోరాడాలని బలంగా ఫిక్స్ అయ్యాడు. కేవలం ఆ రెస్టారెంట్ ఓనర్లను మాత్రమే కాదు.. అక్కడ బిజినెస్ చేసుకుంటున్న ప్రతీ ఒక్కరిని భయపెడుతూ డబ్బులు వసూళు చేస్తూ బ్రతుకుతున్నారంటూ మోహన్ బాబు సిబ్బందిపై ఫైట్ చేయడానికి సిద్ధమయ్యాడు మనోజ్.