ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్యం మెరుగుపడుతున్నట్లు తెలిపారు. ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న మార్క్ కోలుకోవాలని దేశం నలుమూలల నుండి అభిమానులు, పార్టీ కార్యకర్తలు పూజలు చేసి ప్రార్థించిన సంగతి తెలిసిందే.
ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా స్పందించిన పవన్ కళ్యాణ్, “మా కుమారుడి ఆరోగ్యానికి మీరు చేసిన ప్రార్థనలు, చూపిన ప్రేమ, ఆశీస్సులకు నేను మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేవుని దయతో మరియు మీ అందరి ఆశీస్సులతో మార్క్ ఆరోగ్యం ఇప్పుడు మెరుగుపడుతోంది. మీరు అందరూ మా కుటుంబానికి చూపిన ఆదరణ మరువలేనిది,” అంటూ పేర్కొన్నారు.
మార్క్ శంకర్ ఆరోగ్యంపై అభిమానులు నిరంతరం ఆందోళన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఆయన కోలుకోవాలని విషెస్ తెలియజేస్తూ ఉండటం గమనార్హం. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ తన అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు