దేశీయ ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా (Maruti Suzuki India) ఆకర్షణీయమైన కార్లను విడుదల చేయడంలో బాగా ప్రసిద్ధి చెందింది. భారతీయ వినియోగదారుల కోసం తక్కువ ధరలో, ఎక్కువ మైలేజ్ అందించే మోడళ్లను తీసుకొస్తుంది. మార్కెట్లో దీని ఫార్ములా మిగతా కంపెనీలకు భిన్నంగా ఉంటుంది. అందుకే చాలా ఏళ్లుగా ప్రతి ఏడాది కూడా సేల్స్ విషయంలో అందరి కంటే ముందు స్థానంలో నిలుస్తుంది. గత ఏడాది కూడా అగ్రస్థానంలో నిలిచిన మారుతీ తాజాగా ఫిబ్రవరి నెలకు సంబంధించి తన ప్రసిద్ధ హ్యాచ్‌బ్యాక్ వ్యాగన్ఆర్ (wagon R) అమ్మకాల వివరాలను మారుతీ సుజుకీ విడుదల చేసింది.
దీని ప్రకారం, 2025 ఫిబ్రవరి నెలలో మారుతీ సుజుకీ వ్యాగన్ఆర్ హ్యాచ్‌బ్యాక్ మొత్తం 19,879 యూనిట్ల అమ్మకాలను సాధించింది. 2024లో ఇదే నెలలో అమ్ముడుపోయిన 19,412 యూనిట్లతో పోలిస్తే, ఇది ఏడాది ప్రాతిపదికన 2 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం.
2025 జనవరి నెలలో వ్యాగన్ఆర్ హ్యాచ్‌బ్యాక్ 24,078 యూనిట్ల అమ్మకాలను సాధించి మార్కెట్లో బాగా డిమాండ్ ఉన్న మోడల్‌గా అవతరించింది. డాక్టర్లు, ఇంజనీర్లకు, ఉద్యోగస్తులకు రోజువారీ ప్రయాణాలు చేసేవారికి ఈ కారు బాగా సెట్ అవుతుంది. ఇది తక్కువ ధరలో లభించడంతో పాటు, మైలేజ్ కూడా అధికంగానే వస్తుంది. దీంతో భారతీయ వినియోగదారులకు ఇది బాగా ఇష్టమైన మోడల్ అయింది. ఈ హ్యాచ్‌బ్యాక్ పేద, మధ్య తరగతి బడ్జెట్ కారు.
ఫిబ్రవరి నెల అమ్మకాల గణాంకాల ప్రకారం, మారుతీ సుజుకీ ఫాంక్స్ మోడల్ తరువాత అత్యధికంగా అమ్ముడైన ఫ్లాగ్‌షిప్ కార్ల లిస్ట్‌లో వ్యాగన్ఆర్ రెండవ స్థానంలో నిలిచింది. 2025లో మాత్రమే కాకుంగా 2024లో కూడా ఇది సేల్స్ విషయంలో విజయకేతనం ఎగరేసింది. డిసెంబర్‌లో 17,303 యూనిట్లు, నవంబర్‌లో 13,982, అక్టోబర్‌లో 13,922, సెప్టెంబర్‌లో 13,339 యూనిట్ల అమ్మకాలను వ్యాగన్ఆర్ సాధించడం విశేషం.
ప్రతి నెల కూడా సగటున 10 వేల కంటే ఎక్కువ అమ్మకాలను నమోదు చేయడం అంటే మారుతీ వ్యాగన్ఆర్ హ్యాచ్‌బ్యాక్‌కు దేశంలో ఏ రేంజ్ డిమాండ్ ఉందో తెలిసిపోతుంది. ఇటీవల కాలంలో ఆటోమొబైల్ పరిశ్రమలో పోటీ ఎక్కువ అయింది. దీంతో తయారీదారులు పోటాపోటీగా కొత్త కొత్త మోడళ్లను విడుదల చేస్తున్నారు. అయితే మార్కెట్లోకి ఎన్ని కార్లు వచ్చినప్పటికి మాత్రం వ్యాగన్ఆర్ డిమాండ్ మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు.
ప్రస్తుతం దేశీయ మార్కెట్లో కొనుగోలుకు అందుబాటులో ఉన్న మారుతీ సుజుకీ వ్యాగన్ఆర్ హ్యాచ్‌బ్యాక్ ప్రారంభ ధర రూ.5.64 లక్షల నుంచి టాప్ వేరియంట్ ధర రూ.7.47 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. దీని పెర్ఫామెన్స్ కూడా అద్బుతంగా ఉంటుంది. ప్రత్యేకించి డిజైన్ విషయానికి వస్తే, ఎక్స్‌టీరియర్ ఆకట్టుకుంటుంది. ఇది LXI, VXI, ZXI వంటి వేరియంట్లలో కొనుగోలుకు లభిస్తుంది. ఈ కారులో 5 మంది కలిసి ప్రయాణించవచ్చు.
చిన్న కటుంబం గలవారు వీకెండ్స్ సమయాల్లో దూర ప్రాంతాలకు వెళ్లడానికి కూడా ఇది అనువుగా ఉంటుంది. క్కువ లగేజీని తీసుకెళ్లడానికి 312-లీటర్ బూట్ స్పేస్‌ను దీనిలో అందించారు. దీని ఇంజిన్ విషయానికి వస్తే, 1-లీటర్, పెట్రోల్, 1.2-లీటర్ పెట్రోల్, CNG ఇంజిన్లతో ఇది కొనుగోలుకు అందుబాటులో ఉంది. మైలేజ్ విషయానికి వస్తే, పెట్రోల్ వేరియంట్లు లీటరుకు 23.56 నుంచి 25.19 కి.మీలు, CNG కిలోకు 34.05 కి.మీ. మైలేజ్‌ను ఇస్తుంది.