ఇండియాలో అత్యంత సంపన్న కథానాయిక ఎవరు? దీపిక, ఆలియా, కత్రిన, నయనతార ఇలా లీడింగ్ స్టార్లను ధనిక నటీమణులుగా భావిస్తాం. కానీ వీళ్లెవరూ కాదు. వేల కోట్ల ఆస్తులతో అత్యంత ధనికురాలిగా జూహీ చావ్లా పేరు భారతదేశంలో వినిపిస్తుంది. మాధురి ధీక్షిత్, కరిష్మా కపూర్ ల కంటే జూహీచావ్లా సీనియర్. అగ్ర కథానాయికగా సినీపరిశ్రమను ఏలారు. హిందీ చిత్రసీమతో పాటు తెలుగు, తమిళ పరిశ్రమల్లోను జూహీ సుపరిచితురాలు. తెలుగు చిత్రసీమలో జూహీ చావ్లా `విక్కీ దాదా` చిత్రంలో నాగార్జున సరసన నటించారు.
హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024 ఎడిషన్ జూహీ చావ్లా పేరును రికార్డులకెక్కింది. దేశంలో అత్యంత ధనిక నటుడిగా షారూఖ్ నిలిస్తే.. మహిళా నటీమణుల్లో జూహీ చావ్లానే నంబర్-1 ధనికురాలిగా రికార్డుకెక్కింది. 4,600 కోట్ల నికర ఆస్తి విలువతో జాబితాలో టాప్ లో ఉంది. 90లలో హిందీ చిత్ర పరిశ్రమలో అగ్రశ్రేణి నటీమణుల్లో జూహీ చావ్లా ఒకరు.
ఖయామత్ సే ఖయామత్ తక్‌తో తెరంగేట్రం చేసిన తర్వాత 90లలో బోల్ రాధా బోల్, డర్, లోఫర్, ఇష్క్ వంటి హిట్ చిత్రాలతో బాక్సాఫీస్‌ను శాసించింది. కానీ 2000 తర్వాత పూర్తిగా నిర్మాతగా కొనసాగారు. కొన్నిసార్లు సహాయ పాత్రల్లో కనిపించారు.
జూహీ చిత్ర నిర్మాణంలో షారుఖ్ భాగస్వామి. మొదట డ్రీమ్స్ అన్‌లిమిటెడ్ .. ఇప్పుడు రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో జూహీ భాగస్వామిగా ఉన్నారు. 2009 నుండి (లక్ బై ఛాన్స్ విడుదలైనప్పుడు) జూహీకి బాక్సాఫీస్ హిట్ లేకపోయినా, రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో పెట్టుబడి పెట్టడం .. నైట్ రైడర్స్ క్రికెట్ ఫ్రాంచైజీ సహ-యజమాని కావడం వల్ల జూహీ ఆదాయం ఎన్నో రెట్లు పెరిగింది.
జూహీ తన సన్నిహిత మిత్రుడు షారూఖ్ ఖాన్‌తో కలిసి రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ అనే ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీకి సహ-వ్యవస్థాపకురాలు. బాలీవుడ్ ప్రధాన నిర్మాణ సంస్థలలో ఇది ఒకటి. కొన్ని విజయవంతమైన చిత్రాలను నిర్మించింది. విజువల్ ఎఫెక్ట్స్, పోస్ట్ ప్రొడక్షన్ సేవలు మొదలైన వాటిపై పరిశోధన, అభివృద్ధిలో కూడా కంపెనీ పాల్గొంటుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్‌ను జూహీ నడిపిస్తోంది. అందులో కూడా షారూఖ్ తో కలిసి ఆమె వాటాదారు. ఫ్రాంచైజ్ అత్యంత విజయవంతమైంది. జనాదరణ పొందింది..నిజానికి చాలా లాభదాయకంగా ఉంది. ఖాన్ తో పాటు జూహీ నికర ఆదాయ విలువ పెరగడానికి కేకేఆర్ టీమ్ ప్రధానంగా సహాయపడింది.
సినిమాలు – క్రీడలు కాకుండా జూహీ రియల్ ఎస్టేట్‌లోను భారీ పెట్టుబడులు పెట్టారు. భారతదేశం అంతటా కొన్ని అత్యంత విలువైన ఆస్తులను జూహీ చావ్లా సొంతం చేసుకుంది. ఇది తన ఆర్థిక స్థితిని మరింత అభివృద్ధి చేస్తుంది.
మహిళా నటుల మధ్య సంపద పోలిక చూస్తే.. జూహీ చావ్లా నికర ఆస్తి విలువ భారతదేశంలోని చాలా మంది ప్రముఖ నటీమణుల సంపదను అధిగమించింది. జుహీ చావ్లా -రూ.4,600 కోట్లు- $580 మిలియన్ లు కాగా, ఐశ్వర్య రాయ్ బచ్చన్ -రూ.850 కోట్ల నికర ఆస్తితో లీడింగ్ బ్యూటీగా నిలుస్తోంది. ప్రియాంక చోప్రా- రూ.650 కోట్ల నికర ఆస్తులను కలిగి ఉంది.
ఐశ్వర్య రాయ్ (రూ. 900 కోట్లు), ప్రియాంక చోప్రా (రూ. 850 కోట్లు), అలియా భట్ (రూ. 550 కోట్లు), దీపికా పదుకొనే (రూ. 400 కోట్లు), కత్రినా కైఫ్ (రూ. 240 కోట్లు) వంటి అగ్రశ్రేణి కథానాయికల ఆదాయాలన్నిటినీ కలిపినా అంతకుమించి అని జూహీ నిరూపించింది.
కన్నడ, హిందీ సినీ ఇండస్ట్రీలో పలు చిత్రాలలో హీరోయిన్ గా నటించిన.. జూహీ చావ్లా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. విక్కీ దాదా, కలియుగ కర్ణుడు వంటి చిత్రాలలో నటించింది. ఆ తర్వాత క్రేజ్ రావడంతో జుహీ చావ్లా పలు భాషలలో కూడా నటించి భారీ పాపులారిటీ సంపాదించుకుంది.
ప్రస్తుతం ఈమె వయసు 57 సంవత్సరాలు. ఈమె ఆస్తి చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.. రూ.4600 కోట్ల రూపాయలు ఉన్నదట. అలాంటి ఈమె.. ఒక వ్యాపారవేత్తకు రెండవ భార్యగా వెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
1990లో అత్యంత అందమైన నటీమణులలో ఒకరిగా పేరు సొంతం చేసుకుంది. తన నటన, అందంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈమె.. ఎన్నో విజయవంతమైన చిత్రాలలో కూడా నటించింది. ఈమె వయసు 57 ఏళ్లు.. అయినప్పటికీ తన వ్యక్తిగత జీవితంలో కొన్ని కారణాలవల్ల నిరంతరం వార్తలలో నిలుస్తూనే ఉంది.. 17 ఏళ్ల వయసులో మిస్ ఇండియా టైటిల్ని గెల్చుకున్న జుహీ చావ్లా. సుల్తానాద్ అనే చిత్రంతో 1986లో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది.
జుహీ చావ్లా 1995లో జే.మెహతా ను వివాహం చేసుకోగా.. అయితే మెహతాకు ఇదివరకే వివాహమయ్యిందట. ఈయన భార్య సుజాత బిర్లా మరణించింది. సుజాత బిర్లా విమాన ప్రమాదంలో మరణించింది అనే విషయం తెలుసుకొని మెహతను చాలాసార్లు చూసి హృదయం చలించిపోయిందట. అలా వీరిద్దరి మధ్య మొదట ఉన్న స్నేహాన్ని ప్రేమగా మార్చుకొని వివాహం చేసుకున్నారట. అలా సుమారుగా వీరి సంబంధాన్ని ఆరేళ్ల పాటు రహస్యంగా ఉంచారట. జూహి చావ్లా తన మొదటి గర్భం దాల్చే వరకు వివాహ వార్తను బయటికి చెప్పలేదు.
2400 కోట్ల రూపాయలతో జే.మెహతా ఇండియాలోని అత్యంత ధనవంత వ్యాపారిగా పేరు సంపాదించారు. ఇప్పుడు సుమారుగా ఈయన ఆస్తి 4162 కోట్ల రూపాయలు ఉంటుందట. అలా ప్రపంచవ్యాప్తంగా 15000 మందికి పైగా ఈయన మొహతా గ్రూప్ కంపెనీలో పని చేస్తున్నారట. ఈ ఆస్తి అంతటికి కూడా జూహీ చావ్లానే యజమాని. ఇండియాలోని రిచెస్ట్ ధనవంతురాలుగా గత ఏడాది ఈమె పేరు భారతీయ నటిగా వెలుబడిందట.