శింగనమల నియోజకవర్గానికి నిధులు మంజూరు చేయాలని పంచాయితీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ వినతిపత్రం అందజేశారు.
ఎమ్మెల్యే బండారు శ్రావణి మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో కరువు మండలాలకు వేసవి కాలం దృష్ట్యా నీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కోరారు. అలాగే శింగనమల నియోజకవర్గ పరిధి మొత్తం గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయని, రూరల్ అభివృద్ధి కోసం ఎక్కువగా నిధులు విడుదల చేయాలని ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ వినతి చేశారు. అలాగే జల్ జీవన్ మిషన్ కింద గతంలో నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభించాలని కోరారు. సమస్యల పై ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే బండారు శ్రావణి పేర్కొన్నారు.