పరీక్షలకు హాజరవ్వబోయే విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపేందుకు ప్రతిఏటా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పరీక్షా పే చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారన్న సంగతి తెలిసిందే. అలా ఈ సారి కూడా పరీక్షా పే చర్చా నిర్వహించిన మోదీ.. విద్యార్థులు, క్రికెటర్లను స్ఫూర్తిగా తసుకుని నేర్చుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించారు. విద్యార్థులు ఒత్తిడిని.. మైదానంలో బ్యాటర్స్ తరహాలో హ్యాండిల్ చేయాలని అన్నారు. పరీక్షలే సర్వస్వం కాదని చెప్పిన మోదీ.. ఒక దగ్గరే గిరిగీసుకొని ఉండొద్దని సలహా ఇచ్చారు.
”ఎంత ఒత్తిడి ఎదురైనా.. విద్యార్థులు, స్టేడియంలోని బ్యాటర్ల తరహాలో ప్రెజర్ ను హ్యాండిల్ చేయాలి. ఎగ్జామ్ సహా ఇతర విషయాల వల్ల కలిగే ఒత్తిడిపై కాకుండా చదువుపైనే ఫోకస్ పెట్టాలి. స్టేడియంలో ప్రేక్షకులు కేకలేస్తూ, ఈలలేస్తూ, కేరింతలు కొడుతూ ఎంతగా గోల చేస్తున్నప్పటికీ.. ఓ నిజమైన బ్యాటర్ దృష్టి ఎప్పుడూ తన బంతిని బౌండరి బాదడంపై మాత్రమే ఉంటుంది. అలానే విద్యార్థులు కూడా కేవలం నేర్చుకోవడంపైనే దృష్టి పెట్టాలి. ఎగ్జామ్ వల్ల వచ్చే ఒత్తిడిపై కాదు ” అని అన్నారు.
https://x.com/narendramodi/status/1888822808488427664?t=ybSfvnGiaYNDukYLPBnxJQ&s=19
ప్రతి విద్యార్థిలో ఒక్కో రకమైన భిన్న టాలెంట్ ఉంటుందని, ఆ దిశగా వారిని ప్రోత్సాహించాలని టీచర్లకు మోదీ సూచించారు. పిల్లలో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీయాలని అన్నారు. ఈ సందర్భంగా భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందూల్కర్‌ను ఉదహరించారు ప్రధాని మోదీ. ‘సచిన్ తెందుల్కర్ కు చదువు కన్నా ఆటల పైనే ఆసక్తి ఎక్కువగా ఉండేది. దాన్ని గుర్తించిన అతడి తల్లి దండ్రులు ఆ దిశగానే సచిన్ ను ప్రోత్సహించారు.’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.