తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందడంపై ప్రధాని నరేంద్రమోడీ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించిన తెలంగాణ ప్రజలకు ప్రధాని నరేంద్రమోడీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలతో మమేకమై బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం.. శ్రమించిన కార్యకర్తలను చూసి గర్వపడుతున్నా అంటూ మోడీ ట్వీట్ చేశారు. అలాగే ఏపీలోనూ ఎన్డీఏ అభ్యర్థుల విజయంపై మోడీ అభినందనలు తెలియజేశారు. ఇకపోతే తెలంగాణ రెండు టీచర్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగగా..ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ మద్దతు అభ్యర్థి మల్క కొమురయ్య విజయం సాధించగా.. ఉమ్మడి కరీంనగర్ – మెదక్ – నిజామాబాద్- ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించారు. దీంతో తెలంగాణ బీజేపీలో జోష్ నెలకొంది.
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందడంపై ప్రధాని నరేంద్రమోడీ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించిన తెలంగాణ ప్రజలకు ప్రధాని నరేంద్రమోడీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలతో మమేకమై బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం.. శ్రమించిన కార్యకర్తలను చూసి గర్వపడుతున్నా అంటూ మోడీ ట్వీట్ చేశారు. అలాగే ఏపీలోనూ ఎన్డీఏ అభ్యర్థుల విజయంపై మోడీ అభినందనలు తెలియజేశారు.
తెలంగాణ బీజేపీలో ఫుల్ జోష్ నెలకొంది. తెలంగాణ రెండు టీచర్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగగా..ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ మద్దతు అభ్యర్థి మల్క కొమురయ్య విజయం సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా గ్రాడ్యుయేట్ స్థానంలో కూడా బీజేపీ విజయం సాధించింది. ఉమ్మడి కరీంనగర్ – మెదక్ – నిజామాబాద్- ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి గెలుపొందారు.అయితే అధికారిక ప్రకటన కోసం… ఈసీ నుంచి ఆర్‌వో అనుమతి కోరారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కరీంనగర్ – మెదక్ – నిజామాబాద్- ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం ఓట్ల లెక్కింపు మార్చి 3వ తేదీన ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. రెండున్నర రోజుల పాటు సుదీర్ఘంగా ఓట్ల లెక్కింపు సాగింది. అయితే మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఫలితం తేలకపోవడంతో… అధికారులు ఎలిమినేషన్ ప్రక్రియ చేపట్టారు. అయితే గెలుపుకు అవసరమైన మేజిక్ ఫిగర్ చేరుకోకపోయినప్పటికీ… ఓట్ల పరంగా ముందు వరుసలో ఉన్న అంజిరెడ్డిని విజయం వరించింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అభ్యర్థి నరేంద్ రెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. ఆ సమయంలో ఆయన కన్నీరు పెట్టుకున్నారు. ఇప్పటికే కరీంనగర్ – మెదక్ – నిజామాబాద్- ఆదిలాబాద్ టీచర్ ఎమ్మెల్సీ స్థానం కైవసం చేసుకున్న బీజేపీ… ఇప్పుడు కరీంనగర్ – మెదక్ – నిజామాబాద్- ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం కూడా సొంతం చేసుకోవడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. మూడింటిలో రెండు ఎమ్మెల్సీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకోవడంతో… ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో సరికొత్త జోష్ నెలకొంది. పలువురు బీజేపీ నేతలు… అంజిరెడ్డికి అభినందనలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
కాంగ్రెస్‌కు కౌంట్ డౌన్ స్టార్ట్… బండి సంజయ్
కరీంనగర్‌లో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే అంజిరెడ్డితో కలిసి బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని అన్నారు. రెండు ఎమ్మెల్సీలను సొంతం చేసుకున్నామని చెప్పారు. ధాని మోదీ నిజాయితీ పాలనను ప్రజలంతా గుర్తించారనే… అందువల్లే విజయాలు సాధించగలుగుతున్నామని చెప్పారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని… వారు బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీజేపీ భారీ విజయాలు సాధిస్తోందని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.
అంజిరెడ్డికి కిషన్ రెడ్డి అభినందనలు
కరీంనగర్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన అంజి రెడ్డికి కేంద్ర మంత్రి, టీ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అభినందనలు తెలిపారు. తెలంగాణ యువత బీజేపీ అభివృద్ధి రాజకీయాలపై, ప్రధాని మోదీ నాయకత్వంపై తమ నమ్మకాన్ని ఉంచారని.. ఇది తెలంగాణలో బీజేపీకి పెరుగుతున్న ప్రజాదరణకు మరో నిదర్శనమని పేర్కొన్నారు. పట్టభద్రులందరికీ కృతజ్ఞతలు తెలిపిన కిషన్ రెడ్డి… పార్టీ విజయం కోసం కృషి చేసిన కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ (Congress party) అధికారంలో ఉన్న తెలంగాణ (Telangana)లో బీజేపీ (BJP) అనూహ్యంగా మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక టీచర్, మరో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ (Graduate MLC) స్థానంలో విజయం సాధించింది. దీంతో ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ విజయాలు హాట్ టాపిక్‌గా మారాయి. తాజా రెండు ఎమ్మెల్సీలతో తెలంగాణ నుంచి ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన బీజేపీ అభ్యర్థుల సంఖ్య 21కి చేరుకుంది. ఇందులో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు (Eight MLA), 8 మంది ఎంపీలు, ఇద్దరు రాజ్యసభ ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్సీలు ఉన్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు (MLC election results) రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై భారీ ప్రభావం చూపుతాయని రాజకీయ విశ్లేషకులు (Political analysts) అంచనా వేస్తున్నారు.
ఇదిలా ఉంటే తెలంగాణలో జరిగిన మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ (BJP) రెండింట్లో విజయం సాధించడంపై భారత ప్రధాని నరేంద్ర మోడీ (Indian Prime Minister Narendra Modi) స్పందించారు. ఈ సందర్భంగా ఆయన తన ఎక్స్(Twitter) ఖాతాలో ఇలా ట్వీట్ చేశారు.”MLC ఎన్నికల్లో బీజేపీకి అద్భుతమైన మద్దతు ఇచ్చినందుకు తెలంగాణ ప్రజలకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కొత్తగా ఎన్నికైన మా అభ్యర్థులకు అభినందనలు. తెలంగాణ ప్రజల మధ్య ఎంతో శ్రద్ధతో పనిచేస్తున్న మా పార్టీ కార్యకర్తలను చూసి నేను చాలా గర్వపడుతున్నాను.” అని రాసుకొచ్చారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కరీంనగర్ టీచర్స్ ఎమ్మెల్సీ (Karimnagar Teachers MLC) స్థానంలో మల్క కొమురయ్య భారీ మెజార్టీతో మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే గెలవగా.. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం (Graduate MLC position)లో.. మూడు రోజుల పాటు సాగిన ఓట్ల లెక్కింపులో రెండో ప్రాధాన్యత ఓట్లతో అంజిరెడ్డి (Anji Reddy) విజయం సాధించారు.
ఏపీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC Elections) కూటమి పార్టీ అభ్యర్థులు విజయదుందుబి మోగించిన విషయం తెలిసిందే. గెలుపొందిన అభ్యర్థులకు శుభాకాంక్షలు చెబుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. బాబు ట్వీట్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) స్పందిస్తూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీయే అభ్యర్థులకు అభినందనలు తెలియజేశారు. అయితే చంద్రబాబు ఇంగ్లీష్‌లో పెట్టిన పోస్టుకు ప్రధాన మోదీ తెలుగులో సమాధానం చెప్పారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించినందుకు రాష్ట్ర గ్రాడ్యుయేట్ ఓటర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ‘‘ఈరోజు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిర్ణయాత్మక విజయం సాధించారు. ఈ ఫలితాలు మన ప్రజానుకూల విధానాలకు, కుటమి ప్రభుత్వంపై పెరుగుతున్న నమ్మకానికి స్పష్టమైన ప్రజాభిప్రాయంగా పనిచేస్తాయి. కొత్తగా ఎన్నికైన ఇద్దరు ఎమ్మెల్సీలను అభినందిస్తున్నాను. వారిద్దరికీ నా శుభాకాంక్షలు. మన కార్యకర్తలు, నాయకులు, ఈ ఎన్నికల కోసం అవిశ్రాంతంగా పనిచేసిన ప్రతి ఒక్కరినీ నేను అభినందిస్తున్నాను. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గాన్ని గెలుచుకున్నందుకు గాదె శ్రీనివాసులు నాయుడుని కూడా అభినందిస్తున్నాను’’ అని ఎక్స్‌లో సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
తెలుగులో మోడీ ట్వీట్..
ఈ పోస్టుపై ప్రధాన మోదీ స్పందిస్తూ తెలుగులో ట్వీట్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీయే అభ్యర్థులకు మోదీ అభినందనలు తెలియజేశారు. కేంద్రంలోనూ, ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్‌డీయే ప్రభుత్వాలు ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాయన్నారు. రాష్ట్రం యొక్క అభివృద్ధి ప్రయాణాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తాయని మోదీ ఎక్స్‌లో పోస్టు చేశారు.
మోదీకి బాబు థాంక్స్
మోదీ పోస్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా రియాక్ట్ అయ్యారు. ప్రధానికి ధన్యవాదలు తెలియజేశారు. ‘‘ప్రధాని నరేంద్ర మోదీకి రాష్ట్రంలోని ఎన్డీయే పక్షాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ నేతృత్వంలో ఎన్డీఏ అటు దేశంలో ఇటు రాష్ట్రంలో మరెన్నో విజయాలను సాధిస్తుందని నమ్ముతున్నాను. ఎన్డీయే పాలనలో అన్ని వర్గాల ప్రజల సర్వతోముఖాభివృద్ధి జరుగుతుందని ఆశిస్తున్నాను’’ అంటూ చంద్రబాబు పోస్టు చేశారు.
https://x.com/ncbn/status/1897493880087699622?t=ndHZtPBXsE0MmAEFmp6BXQ&s=08