అమెరికా- భారత్ రక్షణ వాణిజ్యం దాదాపు సున్నా నుంచి 20 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీని వల్ల అమెరికా భారత్‌కు మూడో అతిపెద్ద ఆయుధ సరఫరాదారుగా మారింది.
భారతదేశానికి ఆయుధాల సరఫరాలో రష్యా అగ్రస్థానంలో ఉన్నప్పటికీ, భారత్ అమెరికా వైపు మళ్లడంతో రష్యా వాటా 62 శాతం నుంచి 34 శాతానికి (2017-2023 మధ్య) పడిపోయింది.
రక్షణ సంబంధాలను మరింతగా పెంచుకోవడానికి అమెరికా భారతదేశానికి సైనిక పరికరాల అమ్మకాలను “ఈ సంవత్సరం నుంచి అనేక బిలియన్ డాలర్లకు” పెంచుతుందని, చివరికి ఎఫ్-35 స్టెల్త్ యుద్ధ విమానాలను అందించడానికి మార్గం సుగమం చేస్తుందని ట్రంప్ అన్నారు.
అయితే ఇది అంత సులభం కాదంటున్నారు నిపుణులు.
“ఇది బాగానే ఉంది, కానీ ఇది గుర్రం ముందు బండిని పెట్టడం లాంటిది కావచ్చు” అని కుగెల్‌మన్ అన్నారు.
భారతదేశానికి అమెరికా ఆయుధాల అమ్మకాలు పెరుగుతున్నప్పటికీ, అధికారిక అడ్డంకులు, ఎగుమతి నియంత్రణల వంటి సున్నితమైన సాంకేతిక పరిజ్ఞానాల బదిలీని పరిమితం చేస్తాయని ఆయన అంటున్నారు.
భారతదేశం ‘ఎఫ్-35 ఆఫర్‌ను సీరియస్‌గా తీసుకోవడం లేదు’ అని వ్యూహాత్మక వ్యవహారాల నిపుణుడు అజయ్ శుక్లా అన్నారు.
అమెరికా ఆయుధ ఒప్పందాలు సవాళ్లతో కూడుకున్నవని శుక్లా పేర్కొన్నారు – ప్రైవేట్ సంస్థలు దీర్ఘకాలిక భాగస్వామ్యాల కంటే లాభాలకే ప్రాధాన్యత ఇస్తాయి.
రష్యాతో భారత్ ఆయుధ ఒప్పందాలు ఆలస్యం కావడం, దీని వల్ల ఖర్చులు పెరగడం అమెరికాతో భారత రక్షణ సంబంధాలు మరింతగా బలపడే అవకాశం ఉంది.