ఆచార్య టీజర్.. జనవరి 29

117
AcharyaTEASER

అభిమానులు కొండంత ఆశతో ఎదురుచూసిన ఆచార్య అప్ డేట్ వచ్చేసింది. అదేనండీ.. టీజర్ రిలీజ్ అయింది. చెప్పినట్లుగానే 2021 జనవరి 27న ఉదయం పది గంటలకు టీజర్ రిలీజ్ చేశారు. మెగా స్టార్ చిరంజీవి గారు నటించిన సినిమాలో సీన్లు.. షాట్లు ఏవీ కనిపించకపోయినా.. మరో రెండు రోజుల్లో రానున్న అప్ డేట్ కు ముందుగా కాస్తంత హైప్ తీసుకొచ్చారు.

ఆచార్య అని వచ్చే విధంగా.. A..C.. H.. A.. R.. Y.. A.. అక్షరాలతో మొదలై సినిమా గురించి చెప్తూ టీజర్ పూర్తి చేసేశారు. చివర్లో మటుకు మరో రెండ్రోజుల్లో వచ్చే అప్ డేట్ గురించి జనవరి 29న ధర్మస్థలి తలుపులు తెరుచుకోనున్నాయని చెప్పారు. కాకుంటే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కు విజువలైజేషన్ కు ఫీల్ కనెక్ట్ అయ్యేలా ఉంది టీజర్. అవే ఈ లైన్లు..

A– ఓ ప్రతిష్ఠాత్మకమైన కాన్సెప్ట్‌ను ప్రాజెక్టుగా రెడీ చేశాం.

C– బెస్ట్ అందించడానికి చిరంజీవి గారూ మళ్లీ వచ్చేశారు.

H– మహమ్మారి రూపంలో అడ్డంకులు వచ్చి పడ్డాయి.

A– చాలా కాలం తర్వాత గానీ షూటింగ్ కు వెళ్లడం కుదరలేదు.

R– మౌనంగా.. నిర్విరామంగా పనిచేసుకుంటూ వెళ్లి సక్సెస్ చేశారు.

Y– మా ప్రేమను, పడ్డ శ్రమను త్వరలోనే మీరు చూస్తారు.

A– మిమ్మల్ని అబ్బురపరచడానికి త్వరలోనే వచ్చేస్తున్నాం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here