మెగాస్టార్’ చెల్లెలిగా ‘మహానటి’..

164

‘చెల్లెళ్లందరి రక్షాబంధం.. అభిమానులందరి ఆత్మబంధం.. మనందరి అన్నయ్య జన్మదినం’..

మెగస్టార్ చిరంజీవి, మెహర్ రమేష్ కాంబినేషన్లో.. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద అనిల్ సుంకర ఓ క్రేజీ ఫిలిం ప్రొడ్యూస్ చేస్తున్నారు. తమిళ్‌లో ‘తల’ అజిత్ నటించగా సూపర్ డూపర్ హిట్ అయిన ‘వేదాళం’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు.
చిరు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు ‘భోళా శంకర్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అలాగే అన్నాచెల్లెళ్ల అనుబంధానికి అద్దం పట్టే రాఖీ పౌర్ణమి కూడా ఆగస్టు 22నే కావడంతో ‘రాఖీ విత్ భోళా శంకర్’ పేరుతో ఓ బ్యూటిఫుల్ వీడియో రిలీజ్ చేశారు.
ఈ సర్‌ప్రైజింగ్ వీడియోలో కీర్తి సురేష్, చిరంజీవికి రాఖీ కడుతున్నారు. అన్నాచెల్లెళ్ల రిలేషన్‌ని బేస్ చేసుకుని చక్కటి సెంటిమెంట్‌తో ఈ మూవీ తెరకెక్కబోతోంది. ‘చెల్లెళ్లందరి రక్షాబంధం.. అభిమానులందరి ఆత్మబంధం.. మనందరి అన్నయ్య జన్మదినం.. హ్యాపీ బర్త్‌డే అన్నయ్య’.. అంటూ కీర్తి సురేష్ చెప్పిన ఈ అద్భుతమైన వీడియో అందర్నీ ఆకట్టుకుంటోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here