మెగాస్టార్ చిరంజీవికి క‌రోనా పాజిటివ్

30
chiru-gets-carona-positive

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో చాలా మంది ప్ర‌ముఖులు క‌రోనా బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే వారు వైద్యులు చెప్పిన సూచ‌న‌లు పాటిస్తూ త్వ‌ర‌గానే కోలుకున్నారు. మొన్నామ‌ధ్య మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు కూడా క‌రోనాని జ‌యించి ఆరోగ్య‌వంత‌మైన జీవితం కొన‌సాగిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి క‌రోనా బారిన ప‌డ్డారు. దీంతో టాలీవుడ్ ఉలిక్కిప‌డింది.

ఆచార్య సినిమా షూటింగ్ కోసం తాజాగా టెస్ట్ చేయించుకోగా, ఆయ‌న‌కు క‌రోనా పాజిటివ్ అని నిర్ధార‌ణ అయింది. ఈ విష‌యాన్ని చిరంజీవి అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు. అయితే ప్ర‌స్తుతం త‌న‌కు ఎలాంటి ల‌క్ష‌ణాలు లేవ‌ని, ప్ర‌స్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్న‌ట్టు పేర్కొన్నారు. గత కొద్ది రోజుల‌లో త‌నని క‌లిసిన వారందరు ప‌రీక్ష‌లు జ‌రుపుకోవాల‌ని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here