తెలుగు రాష్ట్రాల్లో ఏడేళ్ల కిందట తీవ్ర సంచలనం రేపింది ప్రణయ్ హత్య కేసు. అప్పటివరకు ఇలాంటి ఉదంతాలు జరిగినట్లు ఎక్కడా వెలుగులోకి రాలేదు. వచ్చినా అవేమంత సంచలనం కాలేదు. తన కుమార్తెను ప్రేమ వివాహం చేసుకున్న యువకుడిని భారీమొత్తంలో సుపారీ ఇచ్చి మరీ హత్య చేయించిన ఉదంతం పెను దుమారం రేపింది. ప్రణయ్ హత్య కేసులో తాజాగా నల్లగొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలనం తీర్పు వెల్లడించింది. ఈ కేసులో రెండో నిందితుడికి ఉరి శిక్ష విధించింది. మొదటి నిందుతుడు చనిపోగా.. మిగిలినవారికి జీవితఖైదు విధిస్తూ తీర్పు వెల్లడించింది.
ఉమ్మడి నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన మారుతీరావు పెద్ద వ్యాపారి. సంపన్నుడైన ఆయనకు ఏకైక కుమార్తె అమృత. అగ్ర వర్ణానికి చెందిన ఈ యువతి దళిత యువకుడైన ప్రణయ్ ను ప్రేమించి పెళ్లాడింది. ఈ వివాహం మారుతీరావుకు అసలు ఇష్టం లేదు. దీంతో 2018 సెప్టెంబరు 14న సుపారీ గ్యాంగ్‌తో ప్రణయ్ ను హత్య చేయించాడు. భార్య, తల్లితో కలిసి ఆస్పత్రికి వెళ్లివస్తున్న ప్రణయ్ ను సుపారీ గ్యాంగ్ సభ్యుడు సుభాష్ కుమార్ శర్మ కత్తితో దారుణంగా నరికి చంపాడు. అక్కడికక్కడే ప్రణయ్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ కేసును అప్పట్లో నల్లగొండ ఎస్పీగా ఉన్న ఏవీ రంగనాథ్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఎనిమిది మందిని నిందితులుగా పేర్కొంటూ 2019లో ఛార్జిషీటు దాఖలు చేసింది.
ఐదేళ్లకు పైగా కోర్టులో విచారణ సాగింది. కొన్నాళ్ల కిందట వాదనలు ముగిశాయి. సోమవారం నల్లగొండ కోర్టు తీర్పు ఇస్తూ ప్రణయ్ ను కత్తితో నరికి చంపిన ఏ2 సుభాష్‌కుమార్‌శర్మకు ఉరి శిక్ష విధించింది. ఏ3 అస్గర్ అలీ, ఏ4 బారీ, ఏ5 కరీం, ఏ6 శ్రవణ్‌కుమార్, ఏ7 శివ, ఏ8 నిజాం. సుభాష్ గతంలో బెయిల్ కు ప్రయత్నించినా దొరకలేదు. అలీ వేరే కేసులో జైలులో ఉన్నాడు. మిగిలినవారికి బెయిల్ వచ్చింది.శ్రవణ్ కుమార్ అమృతకు సొంత బాబాయి.
ఇక ఈ కేసులో ఏ1 మారుతీరావు. ఈయన 2020లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. పెళ్లయిన 9 నెలలకే.. ప్రణయ్, అమృత 2018 జనవరిలో ప్రేమ వివాహం చేసుకున్నారు. అదే ఏడాది సెప్టెంబరులో ప్రణయ్ హత్యకు గురయ్యాడు. కాగా, భర్త హత్య సమయానికి కే అమృతకు ఏడు నెలలు. ఆ తర్వాత ఆమెకు కుమారుడు పుట్టాడు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఏ2 సుభాశ్ శర్మకు ఉరిశిక్ష విధించిన కోర్టు.. మిగిలిన నిందితులకు జీవిత ఖైదు విధించింది. కాగా ఈ కేసులో ఏ1గా ఉన్న అమృత తండ్రి అమృతరావు గతంలో ఆత్మహత్య చేసుకొని చనిపోయిన విషయం తెలిసిందే.
తన కుమార్తెను కులాంతర వివాహం చేసుకున్నాడనే నెపంతో మిర్యాలగూడ పట్టణానికి చెందిన మారుతీరావు 2018 సెప్టెంబర్ 14న సుఫారీ గ్యాంగ్ తో ప్రణయ్ ను హత్య చేయించాడు. ఈ కేసును పోలీసులు విచారణ పూర్తి చేసి 2019లో ఎనిమిది మందిని నిందితులుగా ఛార్జిషీటు దాఖలు చేశారు. ఈ కేసుపై సుమారు ఐదేళ్లకుపైగా కోర్టులో విచారణ జరిగింది. ఇటీవలే వాదనలు ముగిశాయి. తాజాగా కోర్టు తుదితీర్పు ఇచ్చింది. ఒకరికి ఉరిశిక్ష, మిగిలిన నిందితులకు జీవిత ఖైదు విధించింది.
ఈ కేసులో అమృత తండ్రి మారుతీరావు ఆత్మహత్య చేసుకొని చనిపోగా.. ముగ్గురు నిందితులు జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. మిగిలిన నలుగురు నిందితులు బెయిల్ మీద బయట ఉన్నారు. తీర్పు నేపథ్యంలో నిందితులందరినీ పోలీసులు కోర్టులో హాజరుపర్చారు.
ఈ కేసులో అమృత తండ్రి మారుతీ రావు ఏ1గా ఉండగా.. ప్రణయ్ ను కత్తితో నరికి చంపిన సుభాష్ శర్మ ఏ2గా ఉన్నాడు. అయితే, సుభాశ్ శర్మకు కోర్టు ఉరి శిక్ష విధించింది. ఏ3 అజ్గర్ అలీ, ఏ4 అబ్దుల్ భారీ, ఏ5 ఎంఏ కరీం, ఏ6 తిరునగరు శ్రవణ్ కుమార్ (మారుతిరావు సోదరుడు), ఏ7 సముద్రాల శివ (మారుతిరావు డ్రైవర్), ఏ8 నజీమ్ (నిందితులు ప్రయాణించిన ఆటో డ్రైవర్ ఓనర్)కు కోర్టు జీవిత ఖైదు విధించింది.