భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా నుంచి నటాషా స్టాంకోవిక్ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుండి నటాషా లవ్ లైఫ్ గురించి చాలా గుసగుసలు వినిపిస్తున్నాయి. చాలా సార్లు నటాషా పేరు తన ప్రాణ స్నేహితుడు అలెగ్జాండర్ అలెక్స్ ఇలిక్‌తో లింకప్ చేస్తూ కథనాలు వెలువడ్డాయి. ఇప్పుడు నటాషా సోషల్ మీడియాలో అలాంటి ఒక నిగూఢమైన పోస్ట్‌ను షేర్ చేసింది. దీన్ని చూసి అందరూ ఆమె మళ్ళీ ప్రేమలో పడిందంటూ ఊహిస్తున్నారు.
నిజానికి నటాషా స్టాంకోవిక్ ఇటీవలి పోస్ట్ సారాంశం ఇలా ఉంది. ఇది చదవగానే, ప్రేమ మళ్ళీ ఆమె జీవితంలోకి ప్రవేశించిందని అందరూ భావించారు. నటాషా తన పోస్ట్‌లో `మళ్ళీ ప్రేమలో పడటం బాగుంది` అని సింపుల్ క్యాప్షన్ ఇచ్చారు. ఇది మాత్రమే కాదు.. ఈ పోస్ట్‌లో సీక్రెట్ వ్యక్తిని ట్యాగ్ చేసింది. ఈ పోస్ట్‌లో నటాషా స్టాంకోవిక్ @officiallyvaddy ని ట్యాగ్ చేసారు.
ఎవరు ఈ అఫీషియల్లీ వడ్డీ? అనేది తెలుసుకోవాలని అందరూ ఆసక్తిగా ఉన్నారు. అయితే ఇది రణబీర్ కపూర్ ఇన్‌స్టా ఖాతా అని కొద్దిరోజుల క్రితం వాదనలు వినిపించాయి. అతడు త్వరలో సోషల్ మీడియాలో అధికారికంగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. రణబీర్ సాఫ్ట్ లాంచ్ ఇలాంటి పోస్ట్‌ల ద్వారా జరుగుతోంది. కానీ ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
హార్దిక్ -నటాషా వివాహం అయిన నాలుగు సంవత్సరాల తర్వాత విడిపోయారు. మొదట వారిద్దరూ సోషల్ మీడియాల ద్వారా అభిమానులకు ఈ విషయాన్ని తెలియజేశారు. ఈ వార్త అందరినీ షాక్‌కు గురిచేసింది. ప్రస్తుతం కుమారుడు అగస్త్యకు సహతల్లిదండ్రులుగా కొనసాగుతున్నారు