సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న వారిలో లేడీస్ సూపర్ స్టార్ నయనతార ఒకరు. ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సెలబ్రిటీలను అభిమానులు సరికొత్త బిరుదులతో గౌరవిస్తూ వారిని ఆ బిరుదులతోనే పిలుస్తూ ఉంటారు. ఇలా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలకు మెగాస్టార్ పవర్ స్టార్ ఐకాన్ స్టార్ సూపర్ స్టార్ వంటి బిరుదులు ఉన్నాయి ఇక హీరోయిన్ల విషయానికి వస్తే… సాయి పల్లవిని నేచురల్ స్టార్ అంటూ కూడా పిలవడం జరుగుతుంది.
ఇలా వారి అభిమాన హీరో హీరోయిన్లను ఇలా బిరుదులతో పిలుచుకుంటూ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇక సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ గా నటి నయనతార కూడా బిరుదును సొంతం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఈమెను అందరూ కూడా లేడీ సూపర్ స్టార్ అంటూ పిలుస్తూ ఉంటారు అయితే తాజాగా నయనతార దయచేసి నన్ను ఎవరు అలా పిలవద్దు అంటూ అభిమానులను రిక్వెస్ట్ చేశారు.
నన్ను చాలామంది అభిమానులు అభిమానంతో లేడీస్ సూపర్ స్టార్ అని పిలుస్తూ ఉంటారు. మీ అందరి ప్రేమ అభిమానం నుంచి ఆ టైటిల్ పుట్టుకు వచ్చిందనే సంగతి నాకు తెలుసు. అయినా ఇకపై నన్ను అందరూ కూడా లేడీ సూపర్ స్టార్ అని కాకుండా నయనతార అని మాత్రమే పిలవాలి అంటూ ఈమె అభిమానులను కోరారు. నన్ను నయనతార అని పిలవడం వల్ల ఒక నటిగా మాత్రమే కాకుండా ఒక వ్యక్తిగా అలా పిలిపించుకోవడం నాకు చాలా ఇష్టం అని తెలిపారు.
ఇలా పేరుతో కాకుండా బిరుదులతో పిలిస్తే కొన్నిసార్లు ఇబ్బందులను కూడా ఎదుర్కోవలసి ఉంటుందని, ఇలాంటి టైటిల్స్ చాలా గొప్పగా ఉంటాయి కానీ అవి తీసుకొచ్చే ఇబ్బందుల వల్ల కొన్ని సార్లు మనం కొంతమందిని దూరం చేసుకోవలసి వస్తుంది అంటూ నయనతార ఈ సందర్భంగా అభిమానులకు రిక్వెస్ట్ చేస్తూ తనని నయనతార అంటూ మాత్రమే పిలవాలని కోరుతూ చేసిన ఈ ప్రకటన సంచలనగా మారింది.