11.10 కోట్ల రూపాయలతో నిర్మించిన నూతన ఐ ఎం ఎఫ్ ఎల్ డిపో గోడౌన్ ను ప్రారంభించిన రాష్ట్ర ఎక్సైజ్ గనులు మరియు భూగర్భ శాఖ మాత్యులు కొల్లు రవీంద్ర
నూతన మధ్య విధానం ద్వారా ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ నాణ్యమైన మద్యాన్ని అందిస్తున్నామని రాష్ట్ర ఎక్సైజ్, గనులు మరియు భూగర్భ శాఖ మాత్యులు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. గురువారం ఉదయం అనంతపురం రూరల్ మండలంలోని సోముల దొడ్డి గ్రామంలో నూతనంగా 11.10 కోట్ల రూపాయలతో నిర్మించిన ఐ ఎం ఎఫ్ ఎల్ డిపో గోడౌన్ ను రాప్తాడు,అనంతపురం, మడకశిర, సింగనమల ఎమ్మెల్యేలు పరిటాల సునీత దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఎమ్మెస్ రాజు బండారు శ్రావణి శ్రీ, జి.ఏ.డి (పొలిటికల్) & రెవెన్యూ (ఎక్సైజ్) శాఖల ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ ముఖేష్ కుమార్ మీనా I.A.S, ఏపీ.ఎస్.బి సి లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు డిస్టర్లరీస్, బ్రేవెరీస్ కమిషనర్ నిశాంత్ కుమార్ ఐ.ఏ.ఎస్ , రాష్ట్ర ఎన్ఫోర్స్మెంట్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ ఐ.పీ.ఎస్,జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ లతో కలిసి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఎక్సైజ్, గనులు మరియు భూగర్భ శాఖ మాత్యులు కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, సబ్ కమిటీని వేసుకొని ఆరు రాష్ట్రాలను పరిశీలించి నూతన మద్యం పాలసీని తీసుకొచ్చామన్నారు. తద్వారా ఒకవైపు ప్రజల ఆరోగ్యానికి పెద్దపేట వేస్తూ, నాణ్యమైన మద్యాన్ని సరఫరా చేస్తున్నామన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 29 డిపోలు ఉన్నాయని ,నేడు 11.10 కోట్ల రూపాయలతో నిర్మించిన ఐ ఎం ఎఫ్ ఎల్ డిపో 30వ గోడౌన్ ను సాంకేతికతను జోడించి అత్యంత ఆధునికంగా నిర్మించడం జరిగిందన్నారు.రాష్ట్రంలో అత్యంత పారదర్శకంగా 3500 మద్యం దుకాణాల కేటాయింపు చేపట్టామని, మద్యం దుకాణాల కేటాయింపు కోసం 90 వేల దరఖాస్తులు అందాయని,దరఖాస్తుల ఫీజు ద్వారా సుమారు1800 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందన్నారు. గోదాము నుంచి వెళ్లే ప్రతి స్టాకు వాహనాన్ని ట్రాక్ చేస్తున్నామన్నారు.వాహనం గోదాం నుంచి దుకాణం వద్దకు వెళ్లే వరకు పర్యవేక్షణ పెట్టే వ్యవస్థ తెచ్చామన్నారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి వచ్చే అక్రమ మద్యాన్ని అరికట్టడం ద్వారా రాష్ట్రంలో30 నుండి 40 శాతం అమ్మకాలు పెరిగాయన్నారు.మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులను అమలు చేస్తున్నామన్నారు.మద్యం దుకాణాలు నిర్వహిస్తున్న వారు ఎవరైనా బెల్ట్ షాపులు నిర్వహిస్తే మొదటిసారి అయితే అయిదు లక్షలు రూపాయలు కాంపౌండ్ను వసూలు చేయడం జరుగుతున్నదని, రెండవసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే ఆషాపుల లైసెన్సు లనురద్దు చేయడం జరుగుతుందన్నారు.
గత ప్రభుత్వం ఎక్సైజ్ శాఖను పూర్తిగా నిర్వీర్యం చేసిందని, సెబ్ ను 70% ఎక్సైజ్ సిబ్బందితో ఏర్పాటు చేసి ఎన్ఫోర్స్మెంట్ లేకుండా చేశారన్నారు.అప్పటివరకు ఉన్న ప్రముఖ బ్రాండ్లను షాపుల్లో ఉంచకుండా కొత్త కొత్త పేర్లతో నాసిరకం మద్యాన్ని సరఫరా చేశారన్నారు. ప్రభుత్వం ఏర్పడ్డాక సెబ్ ను రద్దుచేసి పూర్వం లాగానే ఎక్సైజ్ శాఖను ఒకటిగా చేశామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తో మాట్లాడి ఎక్సైజ్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామన్నారు. రాష్ట్రంలో 29 మద్యం డిపోలు ఉండగా వైసీపీ ప్రభుత్వంలో 10 మద్యం డిపోల ఆదాయాన్ని తాకట్టు పెట్టి 23 వేల కోట్ల రుణం తీసుకున్నారన్నారు.గత ప్రభుత్వంలోజరిగిన మద్యం కొనుగోళ్ల అక్రమాలన్నీ వెలికి తీస్తున్నామని, మద్యం అక్రమాలను నిగ్గుతేల్చడానికి సిట్ ను ఏర్పాటు చేశామని, మద్యం స్కాం లో బాధ్యులైన వారు ఎవరూ తప్పించుకోలేరని వారందరిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
గత ప్రభుత్వ హయాంలో ప్రతి ఒక్కప్రజా ప్రతినిధి పై అక్రమ కేసులు పెట్టడం, దాడులు చేయడం జరిగిందన్నారు. మొన్న రాప్తాడు నియోజకవర్గానికి వచ్చి కుటుంబ కలహాలతో జరిగిన హత్యను రాజకీయం చేయడానికి డబ్బులు ఇచ్చి జనాలను పోగుచేసి పోలీసులపై అనుచిత వ్యాఖ్యలను చేస్తున్నారని దీనిని ప్రజలందరూ గమనించాలన్నారు. గతంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటి పై, తెలుగుదేశం కార్యాలయం పై దాడి చేసిన వారికి ప్రమోషన్స్ ఇస్తూ మంత్రి పదవులను ఇవ్వడం జరిగిందన్నారు.కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తున్నదని,ఏ రాష్ట్రంలో లేని విధంగా 4000 రూపాయల పింఛన్ ఇస్తున్నదని,సంవత్సరానికి 33 వేల కోట్ల రూపాయలు, ప్రతి నెల 64 లక్షల పింఛన్లు ఇస్తున్నామన్నారు. దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లను అర్హత కలిగిన ప్రతి ఇంటికి అందజేస్తున్నామన్నారు.పేదరికం లేని సమాజాన్ని నిర్మించడం కోసం P4 కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రవేశ పెట్టారన్నారు. నవోదయం కార్యక్రమం ద్వారా నాటుసారా,అక్రమమద్యం రవాణా లేకుండా అన్ని చర్యలను చేపట్టడం జరుగుతున్నదన్నారు. రాష్ట్రంలో గంజాయిని నిరోదించేందుకు ఈగల్ వ్యవస్థని ఏర్పాటు చేశామన్నారు.
రాష్ట్ర సాధారణ పరిపాలన, పొలిటికల్ & రెవెన్యూ (ఎక్సైజ్) శాఖల ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ ముఖేష్ కుమార్ మీనా I.A.S, మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం కొత్త మద్యం పాలసీ ద్వారా రెవెన్యూ పెరిగిందన్నారు. అధికారులందరూ నిజాయితీగా, పారదర్శకంగా పనిచేయాలన్నారు. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాలన్నారు. 2016 సంవత్సరంలో ఇక్కడ ఉన్న పాత సారా బాట్లింగ్ ప్లాంట్ కాలిపోయి సుమారు ఎనిమిది నుంచి తొమ్మిది కోట్లు నష్టం వాటిల్లిందన్నారు. ఇన్సూరెన్స్ క్లైమ్ చేయడం జరిగిందన్నారు. అప్పుడు తాను ఎక్సైజ్ కమిషనర్ గా పని చేస్తున్నానని ప్రస్తుత మంత్రివర్యులు అప్పుడు కూడా ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నారని వారి ఆదేశాల మేరకు అనంతపురంనకు రావడం జరిగిందని కాలిపోయిన ప్లాంట్ ను పరిశీలించడం జరిగిందన్నారు. నూతన గోడౌన్ నిర్మించేలా మంత్రి ఉత్తర్వులు జారీ చేశారన్నారు.అనంతరం అధునాతన గోడౌన్ గా నిర్మించడం జరిగిందన్నారు. ప్రస్తుతం కొంత భూ సమస్య ఉందని, ఆ సమస్యను జిల్లా కలెక్టర్ తొందరగా పరిష్కరించాలని, ఇందుకు స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా సహాయ సహకారాలు అందించాలన్నారు. ఆ భూమి కూడా అందుబాటులోకి వస్తే మరిన్ని కార్యాలయాలు ఏర్పాటు చేసి సజావుగా కార్యకలాపాలు నిర్వహించేందుకు వీలుంటుంది అన్నారు.
ఏపీ.ఎస్.బి సి లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు డిస్టర్లరీస్, బ్రేవెరీస్ కమిషనర్ నిశాంత్ కుమార్ ఐ.ఏ.ఎస్ మాట్లాడుతూ, సుమారు 27 వేల చదరపు అడుగులలో అత్యంత సాంకేతికతతో కూడిన ఆత్యాధునిక గోడౌన్ ను నిర్మించడం జరిగిందన్నారు. హమాలీలు పనిచేసేందుకు ఈ గోడౌన్ సౌకర్యవంతంగా ఉంటుందన్నారు.రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ, 2016లో ఈ గోడౌన్ కాలిపోయిందని అప్పట్లోనే మంత్రిగా ఉన్న కొల్లు రవీంద్రను నూతన గోడౌన్ నిర్మించాలని కోరడం జరిగిందని అందుకు 11 కోట్ల రూపాయలు కూడా అపట్లో మంజూరు చేయడం జరిగిందన్నారు. మరలా వారి చేతుల మీదుగానే ఈ గోడౌను ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు. హమాలీల సమస్యలను పరిష్కరించేందుకు మంత్రి మరియు అధికారులు చొరవ తీసుకోవాలన్నారు. కోర్టులో ఉన్న భూ సమస్యను అధికారులు తాము కలిసి పరిష్కరిస్తామన్నారు. మరో ఐదు కోట్లు నిధులు మంజూరు చేస్తే పూర్తిస్థాయి గోడౌన్ తయారవుతుందన్నారు.
మడకశిర, సింగనమల ఎమ్మెల్యేలు ఎమ్మెస్ రాజు, బండారు శ్రావణిశ్రీ మాట్లాడుతూ, హమాలీల సమస్యలను పరిష్కరించాలన్నారు.అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మాట్లాడుతూ పరిటాల సునీతమ్మ కృషితో మరల ఈ నూతన గోడౌన్ ప్రారంభించుకోవడం జరిగిందన్నారు.మంత్రివర్యులు,ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులకు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత జ్ఞాపికలను బహుకరించారు.ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం మంత్రి హమాలీలకు యూనిఫామ్ లను పంపిణీ చేసి,ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి నూతన గోడౌన్ ఆవరణంలో మొక్కను నాటారు.