పంచాయతీ ఎన్నికలు షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ నిమ్మగడ్డ రమేష్

84

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో సంచలనానికి తెరతీశారు. స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా లేమని, ఎలక్షన్స్ వాయిదా వేయాలని జగన్ ప్రభుత్వం కోరిన గంట్లోనే నిమ్మగడ్డ రమేష్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఏకంగా శనివారం నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని ప్రకటించారు. జనవరి 23వ తేదీ నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుందని నోటిఫికేషన్‌లో వెల్లడించారు.

నాలుగు దశల్లో ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ తెలిపారు. ఈ నెల 23న తొలి దశ ఎన్నిలకు నోటిఫికేషన్‌ విడుదల చేస్తామన్నారు. ఈ నెల 27న రెండో దశ ఎన్నికలకు, ఈ నెల 31న మూడో దశ ఎన్నికలకు, ఫిబ్రవరి 4న నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల కానుందని చెప్పారు.

ఇక, ఫిబ్రవరి 5న తొలి దశ పంచాయతీ ఎన్నికలు, ఫిబ్రవరి 9న రెండో దశ, ఫిబ్రవరి 13 మూడో దశ, ఫిబ్రవరి 17న నాలుగో దశ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని వివరించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా శనివారం నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి రానుందని ప్రకటించారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ నోటిఫికేషన్‌పై జగన్ సర్కార్ ఎలా రియాక్ట్ అవుతుందోనని ఆసక్తి నెలకొంది.
ఏపీలో ఎన్నికల కోడ్…*

సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ప్రభుత్వం

కరోనా వ్యాక్సినేషన్ సన్నద్దతలో అధికార యంత్రాంగం ఉంటుందన్న ప్రభుత్వం

వ్యాక్సినేషన్ వలన ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదంటున్న ప్రభుత్వ వర్గాలు…

ఎస్ఈసీ షెడ్యూల్ ను నిలువరించాలని కోరుతూ సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ప్రభుత్వం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here