ప్రారంభానికి సిద్ధమైన నిమ్స్ లోని ఎంఈఐఎల్‌ అంకాలజీ బ్లాక్‌

78

ప్రారంభానికి సిద్ధమైన నిమ్స్ లోని ఎంఈఐఎల్‌ అంకాలజీ బ్లాక్‌
కార్పొరేట్‌ సామాజిక బాధ్యతను నిర్వర్తించడంలో మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ ఎప్పుడూ ముందుంటుంది. అది రైతుల ఆకలి తీర్చడం కావచ్చు, రోగగ్రస్థకు సాంత్వన కావచ్చు, ఆపత్కాలంలో ప్రభుత్వానికి అండగా నిలవడం కావచ్చు, ప్రతీ విషయంలోనూ మేఘా తన బాధ్యతల నిర్వహణలో ఎంతో కృషి చేస్తుంది. క్యాన్సర్‌ వ్యాధి ఎంతోమందిని కబలిస్తోంది. క్యాన్సర్‌ వ్యాధి చికిత్స చేయించుకోవడానికి సాధారణ, మధ్య తరగతి ప్రజల ఆర్థిక పరిస్థితి తలకిందులవుతోంది. ఈ విషయంలో సైతం ఎంఈఐఎల్‌ ముందుకొచ్చింది.
ప్రభుత్వ వైద్య సంస్థ నిమ్స్ లో క్యాన్సర్‌ చికిత్స విభాగం పూర్తిస్థాయిలో సేవలు అందించడానికి అవసరమైన భవన, వైద్య యంత్రాలు, బెడ్లు తదితర సౌకర్యాలను ఎంఈఐఎల్‌ సమకూర్చింది. ఈ భవనాన్ని (బ్లాక్‌) ఈ నెల 9న ఉదయం 11 గంటలకు తెలంగాణ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ ఈటల రాజేందర్‌గారు ప్రారంభించనున్నారు. అధునీకరించిన 20,000 చదరపు అడుగుల వైశ్యాలంలో 50 బెడ్లతో పాటు ఆక్సిజన్‌, వెంటిలేటర్లు, లిఫ్టు, సెంట్రలైజ్డ్‌ ఏసీ వంటి అత్యవసర సదుపాయాలన్నీ ఎంఈఐఎల్‌ సమకూర్చింది. అంతే కాదు గతంలో నిర్మించిన రెండవ అంతస్తు నిర్వహణ బాధ్యతలను కూడా గడిచిన మూడేళ్లుగా మేఘా నిర్వహిస్తోంది.
నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌ (నిమ్స్‌) ఆసుపత్రిలో క్యాన్సర్‌ రోగుల కోసం భారీ నిధులతో ప్రత్యేక విభాగాన్ని 2018 సెప్టెంబర్‌లోనే ప్రారంభించింది. ఈ అంకాలజీ భవనం ప్రారంభ సమయంలో గ్రౌండ్‌ ఫ్లోర్‌, మొదటి అంతస్తులను పరిశీలించిన ఎంఈఐఎల్‌ ఛైర్మన్‌ శ్రీ. పి.పి.రెడ్డి, మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీ. పి. వి. కృష్ణారెడ్డి ఆ రెండింటిని పునర్‌నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీని అమలుపరుస్తూ కోట్ల రూపాయలతో అంకాలజీ విభాగంలోని గ్రౌండ్‌ మరియు మొదటి అంతస్థులను ఆధునిక సదుపాయాలతో పునర్‌ నిర్మించి ప్రారంభోత్సవానికి సిద్ధం చేసింది. నిమ్స్‌ అంకాలజీ బ్లాక్‌లోని గ్రౌండ్‌ ఫ్లోర్‌, మొదటి అంతస్తులను రోగు, సిబ్బంది అవసరాలకు అనుగుణంగా ఆధునీకరించారు.

ఇందులో పురుషుల వార్డుతో పాటు క్యాన్సర్‌ బాధితుల్లో అత్యధికులు మహిళలు ఉండటంతో వారికోసం ప్రత్యేకంగా ఫీమేల్‌ వార్డును, పిల్లల్లో సైతం క్యాన్సర్‌ వ్యాపిస్తుండటంతో వారికోసం ప్రత్యేకంగా పీడియాట్రిక్‌ వార్డు, రక్త క్యాన్సర్‌ బాధితులకు ప్రత్యేకంగా లుకేమియా వార్డును నిర్మించింది. రోగులకు అనుకూలంగా ఉండే విధంగా డిజైన్‌ చేసిన 50 పడకలను ఈ వార్డుల్లో ఏర్పాటు చేశారు. ఐసీయూలో 5 బెడ్లు, పురుషుల వార్డులో 12 బెడ్లు, మహిళ వార్డులో 10 బెడ్లు, చిన్నపిల్లల వార్డులో 11 బెడ్లు, లుకేమియా వార్డులో 12 బెడ్లను ఏర్పాటు చేసింది. ప్రతి బెడ్‌కు ప్రత్యేకంగా నాలుగువైపులా కర్టెన్స్ ను కూడా ఏర్పాటు చేశారు. ప్రతి వార్డు వద్ద రోగులకు నిరంతరం సహాయం అందించేందుకు నర్సుల కోసం ప్రత్యేకంగా నర్స్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు.
క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రోగులకు చికిత్సను అందించేందుకు ఉపయోగించే ఆంకాలజికల్‌ క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌ (ఐసీయూ)ను కూడా ఎంఈఐఎల్‌ ఏర్పాటు చేసింది. క్రిటికల్‌ కండీషన్‌లో ఉన్న క్యాన్సర్‌ రోగులకు ఇన్‌ఫెక్షన్లు సోకే అవకాశం ఎక్కువగా ఉండటం, సమయానికి తగిన మందులు అందించడం, అస్థిరంగా ఉండే రోగుల బ్లడ్‌ ప్రెషర్‌ని నియంత్రించేందుకు ఈ ఐసీయూను వాడుతారు.
కార్పొరేట్‌ సోషియల్‌ రెస్పాన్సిబిలిటీ కింద ఇప్పటికే హైదరాబాద్‌లోని నీలోఫర్‌, ఉస్మానియా ఆస్పత్రులతో పాటు ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆస్పత్రిలో అక్షయ పాత్ర పథకం కింద భోజన సదుపాయాలు నిర్విరామంగా అందిస్తోంది. నాణ్యమైన, రుచికరమైన భోజనాన్ని రోగులతోపాటు, వారి వెంట వచ్చేవారికి సైతం అందిస్తూ… ఆకలి తీరుస్తోంది. సిద్దిపేట, గజ్వేల్‌ లాంటి మార్కెట్‌ యార్డుల్లో పంటలు అమ్ముకోవడానికి వచ్చి ఆకలితో అలమటించే రైతులు, హమాలీలకు సైతం సద్దిమూట పథకం ద్వారా భోజనం అందిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here