ఈ కరోనా మహమ్మమారి మరణాలకు బాధ్యులెవరు?

29
modi-cabinet-expansion

*ఈ కరోనా మహమ్మమారి మరణాలకు బాధ్యులెవరు* – *_కేంద్ర ప్రభుత్వానిది కాదా?_* – కరోనా మహమ్మారితో పోరాడుతూ నిత్యం కొన్ని వేల మంది మరణిస్తున్నారు. – ఇప్పుడు జరుగుతున్న ఈ భారీ మారణహోమానికి బాధ్యత ఏవరిది? – ఆక్సిజన్ ఉత్పత్తికి కావలసిన అనుమతులు, ఉత్పత్తి, నియంత్రణ, రవాణా, సరఫరా అన్నీ కేంద్రప్రభుత్వం ఆధీనంలోనే వున్నాయి. రాష్ర్టాలకు కోటా కేటాయిస్తున్నది కేంద్ర ప్రభుత్వమే. – ప్రాణ రక్షణకు అత్యవసరమైన మందులు (life saving drugs) ఉత్పత్తి అనుమతులు, కేటాయింపు, సరఫరా కూడా కేంద్రం నియంత్రణలోనే జరుగుతోంది. – వాక్సిన్ తయారీ అనుమతులు, రాష్ట్రాలకు కోటా కేటాయింపులు, సరఫరా అన్ని కూడా కేంద్రాధీనంలోనే జరుగుతున్నాయి. – కీలకమైన ఆక్సిజన్, వాక్సిన్, ప్రాణ రక్షణకు అత్యవసరమైన మందులతో సహా అన్నీ కేంద్రం తన నియంత్రణలో పెట్టుకొని రాష్ర్టాలకు సకాలంలో సరఫరా చేయడం లేదు. రాష్ర్టాలు సొంతంగా సమకూర్చుకునే అధికారం లేదు. – ఇటీవల జరిగిన ఎన్నికలు కేంద్ర ప్రభుత్వ కోరిక మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించింది. కుంభమేళా వంటి మతపరమైన వేడుకలకు కూడా కేంద్రమే అనుమతి ఇచ్చింది. – కానీ, కరోనా మహమ్మారి అదుపుతప్పి ప్రజలు మరణిస్తున్నారు, సరైన నియంత్రణ చర్యలు తీసుకోవటం లేదంటూ రాష్ట్రాలమీద నిందలు మోపుతోంది మోడి సర్కార్. – ప్రజా ఆరోగ్యం, వైద్యం అనేవి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ఉమ్మడి బాధ్యత. కానీ కరోనా వంటి వైపరీత్యాలు సంభవించినపుడు రాష్ట్రాలకు కేవలం నామమాత్రపు అధికారాలు ఇచ్చి సర్వ అధికారాలు తన ఆధీనంలో వుంచుకుంటోంది కేంద్రం. – అన్ని అధికారాలు తన నియంత్రణలో పెటుకుని కేంద్రం ఇప్పుడు జరగుతున్న ఈ భారీ ప్రణానష్టాలకు మాత్రం రాష్ర్టాలదే బాధ్యత అంటూ నిందలు మోపుతోంది. అసలు రాష్ర్టాలకు ఏ అధికారం లేకుండా చేసి ఈ భారీ ప్రాణనష్టానికి కారణం కేంద్ర ప్రభుత్వం కాదా? -వాక్సిను ఉత్పత్తి మొదలైన కొత్తల్లో ‘ప్రపంచానికే ఆదర్శం మనం, అనేక దేశాలకు వాక్సిను సరఫరా మనమే చేస్తున్నాం, ఇంచుమించు కరొనాను తరిమికొట్టిన తొలిదేశం మనదే’ అని ప్రచారం చేసుకున్నది ప్రధాని మోడి కాదా? దానికి ఇప్పుడు ఆయన ఏం సమాధానం చెబుతారు?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here