*సర్వదర్శన టోకెన్ల జారీ పునఃప్రారంభం*

*సర్వదర్శన టోకెన్ల జారీ పునఃప్రారంభం*

తిరుమల శ్రీవారి సర్వదర్శనం టైమ్‌ స్లాట్‌ టోకెన్లను తితిదే పునఃప్రారంభించింది.

అలిపిరి సమీపంలోని భూదేవి కాంప్లెక్స్‌లో ప్రత్యేక కౌంటర్ల ద్వారా టికెట్లు జారీ చేస్తున్నారు.

టోకెన్లు పొందిన భక్తులకు మరుసటి రోజు దర్శనం కల్పించనున్నారు.

రోజుకు 3 వేల టోకెన్లను జారీ చేయాలని తితిదే నిర్ణయించింది.

సర్వదర్శనం టికెట్ల కోసం ఉదయం 5 గంటల నుంచే భక్తులు బారులు తీరారు.

లాక్‌డౌన్‌ సడలించిన తర్వాత జూన్‌ 11న దర్శనాలను ప్రారంభించిన తితిదే.. సర్వదర్శనం టోకెన్లను జారీ చేస్తూ వచ్చింది.

అయితే తిరుపతిలో కరోనా విజృంభణతో గత సెప్టెంబర్‌ 6న టికెట్ల జారీని నిలిపివేసింది.

నెలన్నర తర్వాత తిరిగి ప్రారంభించింది

Share.