హైదరాబాద్‌కు చెందిన మార్వాడి కుటుంబంలో జన్మించింది నిధి అగర్వాల్. తొలుత మోడలింగ్ రంగాన్ని ఎంచుకొని ఆ తర్వాత సినిమాల్లో అడుగుపెట్టింది. 2017లో ‘మున్నా మైఖేల్’ అనే హిందీ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన ‘సవ్యసాచి’ సినిమాతో టాలీవుడ్ గడప తొక్కింది. ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికి నిధి అందం, అభినయానికి తెలుగు ప్రేక్షకలోకం ఫిదా అయింది. దీంతో దర్శకనిర్మాతల కన్ను ఆమెపై పడింది.ఆ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా చేసి క్రేజ్ కొట్టేసింది. ఈ మూవీ సక్సెస్ తో నిధి ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది. ఆ తర్వాత సినీ ఆఫర్స్ వచ్చినప్పటికీ ఆమె కెరీర్ పెద్దగా టర్న్ తీసుకోలేదు.
వెండితెరపై హీరోయిన్ గా కనిపించడం అంత తేలికైన విషయం కాదు. ఒక సినిమాకి హీరోయిన్ ఎంపిక జరగడానికి తెరవెనుక జరిగే కసరత్తు ఒక రేంజ్ లో ఉంటుంది. చివరి నిమిషం వరకూ ఆ సినిమాలో ఆ హీరోయిన్ ఉంటుందో లేదో అనేది ఎవరూ చెప్పలేరు. అలాంటి పరిస్థితుల్లో హీరోయిన్ గా ఛాన్స్ సంపాదించుకోవడం… హిట్ కొట్టడం… స్టార్ డమ్ సంపాదించుకోవడం అంటే అది సామాన్యమైన విషయం కాదనే చెప్పాలి.
అలా ఇండస్ట్రీకి వచ్చిన నిధి అగర్వాల్, గ్లామర్ పరంగా ఫస్టు మూవీతోనే మంచి మార్కులు కొట్టేసింది. ఇక త్వరలో సెట్స్ పైకి వెళ్లే ప్రాజెక్టులలో చాలావరకూ పంచదార బొమ్మలాంటి ఈ అమ్మాయినే ఉంటుందని అంతా అనుకున్నారు. ‘ఇస్మార్ట్ శంకర్’ హిట్ తరువాత ఇక ఈ బ్యూటీ కెరియర్ ను ఆపడం ఇప్పట్లో ఎవరి వలన కాదనే టాక్ వినిపించింది. స్టార్ హీరోలతో ఆమె జోరు కొనసాగడం పక్కా అనుకున్నారు. కానీ ఆమె ఒక్కసారిగా కొత్త కుర్రాడితో ‘హీరో’ సినిమా ఒప్పుకుని అందరికీ కలిపి ఒకేసారి షాక్ ఇచ్చింది.
ఆ తరువాత నిధి అగర్వాల్ పవన్ సరసన నాయికగా ‘హరిహర వీరమల్లు’ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెట్ పైకి వెళ్లిన ఈ సినిమా, ఇంతవరకూ బయటికి రాలేకపోయింది. నిజానికి నిధి అగర్వాల్ ఒక సౌందర్య శిల్పం వంటి అమ్మాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఎక్కడో లెక్కలు తప్పడం వలన కెరియర్ తడబడుతూనే ఉంది. ఇక త్వరలో రానున్న ప్రభాస్ సినిమా రాజా సాబ్ లో ఆమె నటించింది. మారుతి దర్శకత్వం వహించిన సినిమా ఇది. మే 22వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమా అయినా నిధి కెరియర్ గ్రాఫ్ ను పరిగెత్తిస్తుందేమో చూడాలి.
https://www.instagram.com/p/DF6yYm6vy2i/?igsh=ZjFkYzMzMDQzZg==