మెగా డాటర్ నిహారిక కొణిదెల ప్రేమలో పడిందట. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా రివీల్ చేసింది. మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన ఏకైక హీరోయిన్ నిహారిక. యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన నిహారిక ఆ తర్వాత లఘు చిత్రాలతో నటిగా మారింది. `ఒక మనసు`, `హ్యాపీ వెడ్డింగ్`, `సూర్యకాంతం` వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. సక్సెస్ అందుకునే లోపే నిహారిక పెళ్లి పెట్టలెక్కింది. 2020లో చైతన్య జొన్నలగడ్డ తో కలిసి ఏడడుగులు వేసింది. కానీ వీరి బంధం ఎక్కువ కాలం సాగలేదు. 2023లో ఈ జంట విడాకులు తీసుకున్నారు.
ఆ తర్వాత మళ్లీ కెరీర్ పై దృష్టి సారించిన నిహారిక.. ఒకవైపు నిర్మాణ రంగంలో కొనసాగుతూనే మరోవైపు నటిగా సత్తా చాటుతోంది. ఇకపోతే సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉండే నిహారిక.. తాజాగా తాను ప్రేమలో పడ్డాను అంటూ పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇంతకీ నిహారిక ప్రేమలో పడింది అబ్బాయితో కాదు ఒక బుడ్డోడితో. అవును, మీరు విన్నది నిజమే.
తన స్నేహితురాలు అంబటి భార్గవి కొడుకు నిహారికను ఉద్దేశిస్తూ రాసిన ఓ లైన్ ను ఇన్‌స్టా స్టోరీలో మెగా డాటర్ షేర్ చేసింది. అందుకు బదులుగా `మైనర్ పాస్‌పోస్ట్ నోట్‌బుక్. నేను అతడిని ప్రేమిస్తున్నాను. అంబటి భార్గవి మా ఫ్రెండ్‌షిప్ మధ్యలోకి నువ్వు రావద్దు. ఒకేనా థాంక్యూ` అంటూ రాసుకొచ్చింది నిహారిక. ఈ పోస్ట్‌కి రెడ్ హార్ట్ సింబల్‌ను కూడా జోడించింది. దీంతో నిహారిక పోస్ట్ వైరల్ గా మారింది. అయితే ఇంతకీ ఆ బుడ్డోడు ఎవరు అన్నది మాత్రం తెలియలేదు.