మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈమె కెరియర్ మొదట్లో బుల్లితెరకు యాంకర్ గా పరిచయం అయ్యారు. ఇలా బుల్లితెర యాంకర్ గా కొనసాగుతున్న నిహారిక అనంతరం హీరోయిన్గా అవకాశాలను అందుకున్నారు. అయితే వరుస మూడు సినిమాలలో నటించిన నిహారిక ఏ ఒక్క సినిమా ద్వారా కూడా హిట్ అందుకోలేకపోయారు. దీంతో తన కుటుంబ సభ్యులు చూపిస్తున్న అబ్బాయిని వివాహం చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు.
నిహారిక జొన్నలగడ్డ వెంకట చైతన్య అనే కుర్రాడిని వివాహం చేసుకున్నారు అయితే వీరి పైవాహిక జీవితం రెండేళ్లకే ముగిసిపోయిందని చెప్పాలి. పెళ్లైన రెండు సంవత్సరాలకి విడాకులు తీసుకుని విడిపోయారు.. ఇలా విడాకులు తీసుకున్న అనంతరం నిహారిక తిరిగి సినిమా ఇండస్ట్రీలో ఎంతో బిజీ అవుతున్నారు. ఒకవైపు నిర్మాతగా సినిమాలు చేస్తూనే మరోవైపు హీరోయిన్ గా కూడా నటిస్తూ కెరియర్ పట్ల బిజీగా ఉన్నారు.
ఇదిలా ఉండగా హారిక తన భర్త వెంకట చైతన్యకు విడాకులు ఇవ్వడంపై పూర్తిగా పశ్చాత్తాప పడుతున్నారని తెలుస్తోంది. తన భర్తకు విడాకులిచి తప్పు చేశానని ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా చెప్పకనే చెప్పేశారు.. అసలు నిహారిక ఏం మాట్లాడారు అనే విషయానికి వస్తే…
సెలబ్రిటీ హోదాతో సంబంధం లేకుండా, విడాకులు ఏ అమ్మాయికైన బాధాకరమైన అనుభవం అని నిహారిక అంగీకరించింది. విడాకుల గురించి ఆలోచిస్తూ ఎవరూ పెళ్లి బంధంలోకి ప్రవేశించరు. కానీ కొన్నిసార్లు పరిణామాలు వేరుగా ఉంటాయి. కొన్ని అదుపు తప్పుతాయి. కష్టమైన నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. జీవితంలో సవాళ్ల నుంచి చాలా నేర్చుకునేందుకు ఆస్కారం ఉందని నిహారిక మాట్లాడటంతో అందరూ షాక్ అవుతున్నారు. నిహారిక విడాకులు తీసుకొని తప్పు చేశానన్న ఉద్దేశంతోనే ఇలా మాట్లాడారా అంటూ పలువురు భావిస్తున్నారు.