మెగా డాటర్ నిహారిక కొణిదెల ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. నటిగా ఈ స్టార్ కిడ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అన్న సంగతిని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొణిదెల నాగబాబు కూతురుగా నిహారిక టాలీవుడ్ లో తనదైన ముద్ర వేసుకుంటున్నారు. హీరోయిన్గా పలు చిత్రాలు చేసినప్పటికీ పెద్దగా హిట్ అందుకోలేదు. కానీ చేసినంతవరకు నిహారిక కొణిదెల కొన్ని బ్యూటిఫుల్ రూల్స్ లో నటించి తెలుగు ఆడియోస్ ను అలరించింది. కాగా ప్రస్తుతం ప్రొడ్యూసర్ గా మంచి కంటెంట్ చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తోంది.
మెగా డాటర్ గా కొణిదెల నిహారిక టాలీవుడ్ లో మంచి పేరుని సంపాదించింది. కానీ అనుకోని కొన్ని సంఘటనలు ఆమె కెరీర్ ని కొంచెం ఆందోళనకు గురి చేసిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ నిహారిక నటిగా ప్రేక్షకులను ఓవైపు అలరిస్తూనే మరోవైపు ప్రొడ్యూసర్ గాను గుర్తుండిపోయే చిత్రాలను నిర్మిస్తోంది. అయితే నిహారిక సోషల్ మీడియాలోనూ, పలు ఇంటర్వ్యూలోను తన పర్సనల్ విషయాలను నిర్మోహమాటంగా పంచుకుంటూ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిహారిక తన డివోర్స్ గురించి రీసెంట్ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.
తాజా ఇంటర్వ్యూలో తన డివోర్స్ గురించి ఓపెన్ అయ్యింది. ఈ సందర్భంగా నిహారిక మాట్లాడుతూ…. ఏ ఒక్కరు కూడా డివోర్స్ తీసుకోవాలనే ఆలోచనతో పెళ్లి చేసుకోరు అని తెలిపింది. కానీ కొన్ని పరిస్థితులు మనల్ని అవుట్ ఆఫ్ కంట్రోల్ గా నడిపిస్తాయని వివరణ ఇచ్చింది. కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకునేలా పరిస్థితులు బలవంతం చేస్తాయి. విడాకులు అనేది ఏ మహిళకైనా ఎంత బాధాకరమైన విషయమని చెప్పుకొచ్చింది. అలాంటి పరిస్థితులను ఎదుర్కోవడం లైఫ్ లో ఎంతో కష్టంగా ఉంటుందని చెప్పింది.
అలాగే.. అలాంటి కఠినమైన సవాల్ నుంచి ఏదో ఒకటి నేర్చుకోవాలని, జీవిత పాఠాలలో నేర్చుకోవడానికి ఎంతో ఉంటుందని ఆమె నమ్ముతున్నట్టు తెలియజేసింది. లైఫ్ లో వచ్చే ప్రతి ఛాలెంజ్ ను స్వీకరించి నేర్చుకునే స్వభావాన్ని అలవాటు చేసుకుంటే మంచిదని అభిప్రాయపడింది. అలా నిహారిక కొణిదెల తన జీవితంలో జరిగిన చేదు అనుభవాన్ని పంచుకుంది. కాస్త ఎమోషనల్ అయింది. డివోర్స్ గురించి నిహారిక మాట్లాడిన మాటలు అభిమానులను కాస్త భావోద్వేగానికి గురిచేశాయి.
ఏదేమైనప్పటికీ.. తన లైఫ్ లో ఎన్ని ఛాలెంజెస్ ఎదురైనప్పటికీ అన్నింటికీ భరించి సరికొత్తగా మళ్లీ లైఫ్ ను లీడ్ చేస్తుంది. ఇక నిహారిక కొన్నిదెల 2020 సంవత్సరంలో చైతన్య జొన్నలగడ్డ ను రాజస్థాన్లోని ఉదయపూర్ లో గ్రాండ్ గా కుటుంబ సభ్యుల మధ్య, బంధుమిత్రుల మధ్య వివాహం చేసుకుంది. మూడేళ్ల పాటు సాఫీగానే సాగిన ఈ బంధం ఏ కారణం చేతనో విడిపోవాల్సి వచ్చింది. దాంతో 2023 జూలై 5న నిహారిక కొణిదెల చైతన్య జొన్నలగడ్డకు విడాకులు ప్రకటించింది. ప్రస్తుతం తన కెరీర్ పైననే నిహారిక ఫుల్ ఫోకస్ పెట్టింది.