పాలకొల్లు నియోజవర్గ సోదర సోదరీమణులారా ఆనందం, ఆవేదన కలగలిపిన నా మానసిక స్థితిని, మీతో పంచుకోవాలనిపించి ఈ పోస్ట్ పెడుతున్నాను. మన నాయకుడు, మన ఎమ్మెల్యే, మంత్రి రామానాయుడు గారు అసెంబ్లీ సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరవుతున్న సంగతి మీ అందరికీ తెలుసు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమర్థంగా సమాధానాలు చెబుతున్న దృశ్యాలు మీరు టీవీల్లో చూస్తున్నారు. ఆయన మాటలు వింటున్నారు.. అంతవరకు ఆనందమే. అయితే గత నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న సంగతి, హాస్పిటల్ లో సెలైన్లు ఎక్కించుకుని , అసెంబ్లీకి హాజరవుతున్న సంగతి మీలో చాలామందికి తెలియదనే అనుకుంటున్నాను.
రెండు నెలల కిందట పాలకొల్లు నియోజకవర్గ అభివృద్ధి పనులకు సంబంధించి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (CSR) నిధులు కోసం, ఇంటర్నేషనల్ ఫార్మాషూటికల్ వయాట్రిస్ హెల్త్ కేర్ (వీఆర్టీస్) కంపెనీకి డాక్టర్ నిమ్మల దరఖాస్తు చేసి అపాయింట్మెంట్ అడిగారు. ఎట్టకేలకు కంపెనీ CSR ఇండియా హెడ్ మిస్ డొమినికా పాలకొల్లులో అవసరమైన అవసరమైన అభివృద్ధి పనులు గురించి వివరించేందుకు రాత్రి 7 గంటలకు హైదరాబాద్ రమ్మని సమాచారం ఇచ్చారు.
కానీ గత నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న సమయంలో హైదరాబాద్ వద్దు రెస్ట్ తీసుకోమని, మణిపాల్ ఆసుపత్రి నందు డాక్టర్లు చెప్పినా కూడా, అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత వెళ్లకపోతే నియోజకవర్గ అభివృద్ధి కోసం అవకాశం కోల్పోతామనే భావనతో ….
గురువారం ఉదయం నుంచి తీవ్ర జ్వరంతో ఉండి కూడా,
అసెంబ్లీకి హాజరై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమర్థంగా సమాధానాలు చెప్పి… మధ్యలో క్యాంప్ ఆఫీస్ కు వెళ్లి, మళ్లీ సెలయిన్, ఐ వి ఎక్కించుకున్నారు.
ఇంత జ్వరంలోనూ, అసెంబ్లీ హడావిడిలోనూ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాదు బయలుదేరి వెళ్లి గ్రాండ్ కాకతీయ హోటల్ బోర్డు మీటింగ్ హాల్ నందు CSR నిధుల సాధన సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం అనంతరం హోటల్ నందు మరొక సెలైన్, ఐ వి ఎక్కించుకొని అక్కడి నుంచి రాత్రే విజయవాడ బయలుదేరి శుక్రవారం అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు సిద్ధమయ్యారు. ఇదంతా మన నియోజకవర్గ ప్రజలపై ఉన్న ప్రత్యేక శ్రద్ధకు, ప్రత్యక్ష తార్కాణం. ఇదంతా తెలిసిన నాకు మన నాయకుడు డాక్టర్ నిమ్మలగురించి గర్వపడుతున్నాను. హ్యాట్సాఫ్ నిమ్మల