*విధ్వంస కారుడే జగన్ విధ్వంసానికి నిర్వచనం చెప్పడం ఈ శతాబ్దపు విడ్డూరం-మంత్రి నిమ్మల రామానాయుడు
విధ్వంస కారుడు జగన్ విధ్వంసం గురించి వివరించడం ఈ శతాబ్దపు విడ్డూరం అని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో చంద్రబాబు పాలనపై నోటికి వచ్చినట్లు మాట్లాడిన జగన్ తీరుపై మంత్రి రామానాయుడు మండిపడ్డారు. పిచ్చి నిర్ణయాలకు, అడ్డుగోలు విధానాలకు ప్రజా కంఠపాలనకు చరిత్రలో తుగ్లకు పేరు ఉంది. గత ఐదేళ్ల జగన్ పాలను చూసిన ప్రజలు తుగ్లక్ ను మర్చిపోయారు .జగన్ పాలన కంటే తుగ్లక్ పాలనే మెరుగన్న అపఖ్యాతికి జగన్ లోనయ్యాడన్నారు. భవిష్యత్తులో చెత్త పరిపాలనకు ఎవరైనా ఒడిగడితే తుగ్లక్ పాలనకు బదులు జగన్ పాలన అని ఎద్దేవా చేసే స్థాయికి జగన్ దిగజారిపోయాడన్నారు.
జగన్ 5 ఏళ్ళ రివర్స్ పాలన చూసి దేశంలోని రాష్ట్రాలే కాదు ….ప్రపంచదేశాలే నివ్వెరపోయాయని ధ్వజమెత్తారు . ఎక్కడ అభివృద్ధి పనులు అక్కడే ఆపేసి రివర్స్ టెండరింగ్ పేరిట డబ్బు ఆదా చేశాను అంటూ పోలవరం ప్రాజెక్టును పడుకోబెట్టేసాడని ఆవేదన చెందారు. అతని నిర్లక్ష్యం కారణంగా ప్రాజెక్టు ఉనికి ప్రశ్నార్థకం అయింది అన్నారు. డయాఫ్రమ్ వాల్ కొట్టు పోయిందని విమర్శించారు.
ఫలితంగా
ఆర్థిక భారం పెంచావు. అడ్డదారులు తొక్కావు .నేడు డివాల్ కు వెయ్యు కోట్లు అదనపు వ్యయం అవుతుందన్నారు. ఆంధ్రుల జీవనాడి పోలవరం ఎత్తును 41.15 మీటర్ల అని చెప్పి అణువణువునా అన్యాయం చేసింది, రివర్స్ టెండరింగు అని 600 కోట్లు ఆదాచేసానని చెప్పి పోలవరాన్ని ముంచేసి లక్షలాది కోట్లు రాష్ట్రానికి జగన్ భారాన్ని మిగిల్చాడని అన్నారు.ఇలా నీటిపారుదల రంగాన్నే కాకుండా జగన్ 5 ఏళ్ళ పాలనలో అన్ని రంగాల ప్రగతి పాతాళం వైపు పరుగులు తీసిందని,ఎక్కడి దొంగలు అక్కడే గఫ్ చుప్ అన్నట్లుగా జగన్ అరాచక పాలనలో ఎక్కడి పనులు అక్కడే బంద్ అయ్యాయని అన్నారు. ఆర్థిక భారం పెంచావు. అడ్డదారులు తొక్కావు. ఆంధ్రుల జీవన స్థితిగతులను అస్తవ్యస్తం చేసిన జగన్ ను తెలుగు ప్రజలు క్షమించరని మంత్రి రామానాయుడు అన్నారు.
బటన్ నొక్కడం బ్రహ్మాండమైతే, ప్రజలు నీకు ఎందుకు బ్రహ్మరధం పట్టలేదని ప్రశ్నించారు . నీ ఘోర పరాజయానికి,రాజకీయ పతనానికి కారణాలు విశ్లేషించుకో, ఓటమి నుండి పాఠాలు నేర్చుకో… అంతే తప్ప నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం, పరిపాలన దక్షత గల చంద్రబాబు పై విమర్శలు చేస్తే సహించేది లేదన్నారు. నరేంద్ర మోదీ, చంద్రబాబు,పవన్ కల్యాణ్ వంటి గొప్ప నేతల మేలు కలయికగా ఏర్పడ్డ కూటమికి ఆంధ్రులు అఖండ విజయం చేకూర్చారని ఆయన చెప్పారు. ఈ అఖండ విజయం ఆంధ్రుల సమిష్టి నిర్ణయం అని తెలుసుకో వారిపై విమర్శలు చేస్తే ఆంధ్రులపై విమర్శలు చేసినట్టే నని మంత్రి తెలిపారు .