హైదరాబాద్: ఓలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్‌కి మరో ప్రాతిష్ఠాత్మక విజయము లభించింది. దేశంలోనే తొలిసారిగా, అతిపెద్ద “ఔట్‌రైట్ పర్చేజ్” మోడల్ కింద హిమాచల్ ప్రదేశ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (HRTC) నుండి మొత్తం 297 నాన్-ఏసీ, 9-మీటర్ల ఎలక్ట్రిక్ బస్సుల ఆర్డర్‌ను ఓలెక్ట్రా పొందింది.
హిమాచల్ RTC ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మురారి లాల్ (HPAS) నుంచి అధికారికంగా లెటర్ ఆఫ్ అవార్డ్ (LOA) అందుకున్నట్టు ఓలెక్ట్రా సంస్థ వెల్లడించింది. మొత్తం రూ.424 కోట్ల విలువైన ఈ ఆర్డర్, ఒకే రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు వచ్చిన అతిపెద్ద ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుగా నిలిచింది.
ఈ బస్సులు ప్రత్యేకంగా హిమాచల్ ప్రదేశ్ వంటి కొండ ప్రాంతాల్లో సాగదలిచే ఘాటు మార్గాల్లో ప్రయాణించేందుకు రూపొంచబడ్డాయి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 180 కిలోమీటర్ల వరకూ ప్రయాణించగలిగే ఈ బస్సులు 30 మందికి సీటింగ్ సామర్థ్యంతో అందుబాటులోకి రానున్నాయి.ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా పర్యావరణహిత, సుస్థిర బస్సు సేవలకు ఊతమిస్తూ తీసుకుంటున్న చర్యల్లో ఇది కీలక ముందడుగు.
ఈ సందర్భంగా ఓలెక్ట్రా సంస్థ ప్రతినిధులు, “దేశంలోనే మొట్టమొదటి మరియు అతిపెద్ద ‘ఔట్‌రైట్’ ఎలక్ట్రిక్ బస్సుల ఆర్డర్ ను పొందినందుకు మేము గర్వపడుతున్నాం” అంటూ హర్షం వ్యక్తం చేశారు.