హారర్ థ్రిల్లర్లు ఇష్టపడే వారికి రీసెంట్‍గా రెండు ఆప్షన్లు సూటయ్యేలా వచ్చాయి. కామెడీ లేకుండా పక్కా థ్రిల్లర్లుగా ఎంట్రీ ఇచ్చాయి. అందులో ఒకటి సినిమా కాగా.. మరొకటి వెబ్ సిరీస్. హారర్ జానర్లో వచ్చిన ఈ రెండింటింకి మంచి రెస్పాన్స్ వస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఇవి రెండు వారాల వ్యవధిలో వచ్చాయి. ఆ రెండు హారర్ థ్రిల్లర్ ఏవంటే..హారర్ థ్రిల్లర్ ‘ఛోరీ 2’ సినిమా గత వారం ఏప్రిల్ 11వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. నాలుగేళ్ల కిందట వచ్చిన ఛోరీకి సీక్వెల్‍గా అడుగుపెట్టింది. ఛోరీ 2 మూవీలో నుష్రత్ బరూచా, సోహా అలీ ఖాన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ థియేటర్లలో విడుదల కాకుండా నేరుగా ఓటీటీలోకే ఎంట్రీ ఇచ్చింది.
తన ఏడేళ్ల కూతురిని దుష్టశక్తులు, సామాజిక దురాచారం నుంచి రక్షించేందుకు ఓ తల్లి చేసే ప్రయత్నాలతో ఛోరీ 2 సినిమా సాగుతుంది. హారర్ ఎలిమిమెంట్లతో థ్రిల్లింగ్‍గా ఈ మూవీ ఉంటుంది. ఈ సినిమాకు విశాల్ ఫురియా దర్శకత్వం వహించారు. నుష్రత్, సోహా అలీ ఖాన్ లీడ్ రోల్స్ చేయగా.. హార్దిక శర్మ, గష్మిర్ మహాజాని కీరోల్స్ చేశారు. ఈ చిత్రానికి అద్రిజ గుప్తా సంగీతం అందించారు. ఈ మూవీని ప్రైమ్ వీడియోలో హిందీలో చూడొచ్చు. ఇంగ్లిష్ సబ్‍టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి.ఖౌఫ్ వెబ్ సిరీస్ ఈ శుక్రవారం (ఏప్రిల్ 18) అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ హారర్ థ్రిల్లర్ సిరీస్‍లో మోనికా పవర్, రజత్ కపూర్ ప్రధాన పాత్రలు పోషించారు. హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడలోనూ ఈ సిరీస్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. ఈ సిరీస్‍కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఖౌఫ్ వెబ్ సిరీస్‍కు పంకజ్ కుమార్, సూర్య బాలకృష్ణన్ దర్శకత్వం వహించారు. స్మితా సింగ్ కథ అందించారు. గత గతాన్ని మరిచిరిపోయేందుకు ఓ అమ్మాయి ఢిల్లీలోని ఓ హాస్టల్‍లో చేరడం, ఆ గదికి భయానక గతం ఉండడం, ఆ అమ్మాయికి ఊహించని పరిస్థితులు ఎదురవడంతో ఈ సిరీస్ ఉంటుంది. పక్కా హారర్ థ్రిల్లర్‌గా ఈ సిరీస్ రూపొందింది.మోనికా, రజత్‍తో పాటు ఖౌఫ్ సిరీస్‍లో గీతాంజలి కులకర్ణి, శిల్పా శుక్లా, అభిషేక్ చౌహాన్ కీలకపాత్రలు పోషించారు. సంజయ్ రౌట్రే, సరితా పాటిల్ ఈ సిరీస్‍ను నిర్మించారు. హారర్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న ఈ ఖౌఫ్ సిరీస్‍ను తప్పకచూడొచ్చు.