ప్రభాస్ ప్రస్తుతం ‘రాజాసాబ్’ సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రాజాసాబ్ సినిమాలో ప్రభాస్‌కి జోడీగా ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారనే విషయం తెల్సిందే. రాజాసాబ్ సినిమాతో పాటు ప్రభాస్ మరో వైపు ఫౌజీ సినిమాలోనూ నటిస్తున్నాడు. ‘సీతారామం’ చిత్ర దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు స్పీడ్‌గా జరుగుతున్నాయి. షూటింగ్ ప్రారంభం సమయంలోనే హీరోయిన్‌గా ఇమాన్విని ఎంపిక చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే సినిమాలో మరో హీరోయిన్ పాత్ర ఉంటుందని, ఆమెను ఎంపిక చేసే పనిలో హను ఉన్నాడనే వార్తలు వస్తున్నాయి.
ఫౌజీ సినిమాలో ఇమాన్వితో పాటు మరో హీరోయిన్ ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. ఆ హీరోయిన్ ఎవరు అనే విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. సినిమా కథ అనుసారం గెస్ట్ పాత్రలో బాలీవుడ్ హీరోయిన్‌ను చూపించబోతున్నారట. కథలో యువరాణి పాత్ర అత్యంత కీలకమైన గెస్ట్ రోల్. ఆ పాత్రకు గాను బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్‌ను సంప్రదిస్తున్నారని తెలుస్తోంది. కేవలం 20 నుంచి 30 నిమిషాలు మాత్రమే ఆమె కనిపించబోతుందని, అందుకోసం సాలిడ్ పారితోషికంను ఆఫర్ చేస్తున్నారని తెలుస్తోంది. ఆలియా భట్ సైతం కథలో కీలకం కనుక నటించేందుకు ఓకే చెప్పిందని తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయమై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఆలియా భట్ ఇంతకు ముందు రాజమౌళి దర్శకత్వంలో ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో నటించింది. రామ్ చరణ్‌కి జోడీగా ఆ సినిమాలో ఆలియా భట్ నటించిన విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన ఆ సినిమాలో ఆలియా భట్ పాత్ర మరింత ఎక్కువ ఉంటే బాగుండేది అనే అభిప్రాయం వ్యక్తం అయింది. అయితే ఆలియా భట్ మాత్రం ఆర్ఆర్‌ఆర్ సినిమా విషయంలో ఎప్పుడూ అసంతృప్తి వ్యక్తం చేయలేదు. హీరోయిన్‌గా సౌత్‌లో మరిన్ని సినిమాలు చేసేందుకు గాను ఆలియా భట్ రెడీగా ఉన్నట్లు ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. కనుక ఫౌజీలో ఆమె నటించే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఆర్మీ నేపథ్యంలో రూపొందుతున్న ఫౌజీ సినిమాను ఇదే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు గాను ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకోసం ఆగస్టు వరకు షూటింగ్ పూర్తి చేయాలని హను రాఘవపూడి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ స్టార్ నటుడు అనుపమ్ ఖేర్ సైతం నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన ఇటీవలే షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు. మరో వైపు సినిమాలో సీనియర్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సైతం కనిపించబోతుంది అనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.