పార్వతి నాయర్(Parvati Nair) 15 ఏళ్లు ఉన్నప్పుడే మోడలింగ్‌లోకి ఎంటర్ అయింది. ఇక కర్ణాటక మైసూర్ శాండల్ సోప్ బ్రాండ్ అంబాసిడర్‌గా, నెవీ క్వీన్ అందాల పోటీలో టైటిల్ గెలుచుకుంది. అలాగే మిస్ కర్ణాటక అందాల పోటీలో పాల్గొని మొదటి బహుమతి అందుకుని అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంది. ఆ తర్వాత ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని రాష్ట్ర స్థాయిలో ఎంపికై ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ఇక2012లో నటనపై ఫోకస్ పెట్టి ‘పాపిన్స్’(Poppins) అనే చిత్రంతో మలయాళ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. 2015లో అజిత్ ‘ఎన్నై అరిందాల్’(Ennai Arindal) మూవీలో విలన్ అరుణ్ విజయ్‌కి జంటగా చేసింది.
అయితే ఈ సినిమాకు ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డుకు కూడా నామినేట్ అయింది. చివరగా ఈ అమ్మడు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్(Vijay) ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్’(The Greatest of All Time) సినిమాలో కూడా నటించింది. ప్రస్తుతం ‘ఆలంబన’ (Alambana)అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో.. పార్వతి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించింది. చెన్నైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఆశ్రిత్ అశోక్‌తో ఏడడుగులు వేయనున్నట్లు తెలిపింది. అంతేకాకుండా ఆమె నిశ్చితార్థం ఫొటోలను షేర్ చేస్తూ న్యూ చాప్టర్ స్టార్ట్ అయినట్లు వెల్లడించింది. ప్రస్తుతం పార్వతి ఎంగేజ్‌మెంట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతుండగా.. ఇక అవి చూసిన వారు కంగ్రాట్స్ డార్లింగ్, స్వీట్‌హార్ట్ అని కామెంట్లు చేస్తున్నారు.