పాస్టర్ ప్రవీణ్ మృత్యువు కేసు రోజు రోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. తాజాగా బయటపడ్డ సీసీటీవీ ఫుటేజ్‌తో ఈ ఘటనపై మరిన్ని అనుమానాలు తెరపైకి వచ్చాయి. జగ్గయ్యపేట దగ్గర ఫుటేజ్ ప్రకారం, ప్రవీణ్ రెండు వాహనాల మధ్యలో పడిపోయారు. ఒకవైపు లారీ, మరోవైపు ఆర్టీసీ బస్సు వేగంగా వస్తున్నాయి. ఈ సమయంలో ఆయన అదుపు తప్పి పడిపోవడంతో అక్కడే పెద్ద ప్రమాదం తప్పింది.ఇంతలో కీసర టోల్‌గేట్ దగ్గర కూడా ప్రవీణ్ బైక్ అదుపుతప్పిన ఫుటేజ్ బయటపడింది. అక్కడ గోడను ఢీకొన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో విజయవాడలో ఉండాల్సిన ఆయన ఎందుకు ముందుకు వెళ్లారని నమ్మకస్తులు ప్రశ్నిస్తున్నారు. అతనిపై ఏదైనా ఒత్తిడా? లేదంటే ఎవరి నుంచి భయం? అనే అనుమానాలు తెరపైకి వచ్చాయి. మూడు సార్లు ప్రమాదం తప్పించుకున్నా, చివరకు రాజమండ్రి సమీపంలో ప్రాణాలు కోల్పోవడం విచారకరం.
ఇదిలా ఉంటే, హర్షకుమార్ చేసిన వ్యాఖ్యలపై పోలీసులు స్పందించారు. ఆయనను అడిగిన వివరాలపై తిరిగి నోటీసులు జారీ చేశారు. ఏమైనా సాక్ష్యాలు ఉంటే ఇవ్వాలని కోరారు. హర్షకుమార్ మాత్రం తాను ఆరోపణలు చేయలేదని, ఆర్‌టీఐ ప్రకారం ప్రశ్నలు అడిగానని చెబుతున్నారు. ఇది కొత్త దిశగా దర్యాప్తు కొనసాగుతోంది.ఇప్పటికే ఈ కేసు రాజకీయ మలినాల దిశగా మళ్లినట్టు కొందరి అభిప్రాయం. సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పాస్టర్ మద్యం తీసుకున్నట్లు రకరకాలుగా కామెంట్స్ వస్తున్నాయి. సీఎం చంద్రబాబు స్వయంగా కేసును పర్యవేక్షిస్తున్నట్లు హోంమంత్రి వెల్లడించారు. పోస్టుమార్టం నివేదిక రాగానే వాస్తవం బహిర్గతం అవుతుందని అన్నారు. ప్రవీణ్ మరణం వెనక అసలు కారణాలు ఎలాగైనా బయటకు రావాలని కుటుంబ సభ్యులు, పాస్టర్ల సంఘాలు కోరుకుంటున్నాయి.
పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద మరణం కలకలంగా మారుతోంది. ఇప్పటికే ఈ కేసులో పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ లు సేకరిస్తున్నారు. ఈ మరణం పైన తాజా గా ప్రవీణ్ సతీమణి.. ఆయన సోదరుడు స్పందించారు. మరో వైపు ప్రవీణ్ మరణానికి ముందు ప్రమాదానికి గురైన మరో సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. పడుతూ.. లేస్తూ.. వరుస ప్రమాదా లకు ప్రవీణ్ గురైనట్లు ఈ ఫుటేజ్ స్పష్టం చేస్తోంది. ఇక.. ప్రవీణ్ సతీమణి వెల్లడించిన అంశాలు ఇప్పుడు ఆసక్తి కరంగా మారాయి.
పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం పైన ఆయన సతీమణి జెస్సికా తో పాటుగా సోదరుడు కిరణ్ స్పం దించారు. ఈ కేసులో రాజకీయ, మతపరమైన ప్రయోజనాలకు వాడుకోవడం ఆపి వేయాలని కోరారు. ప్రవీణ్ పగడాల మృతిపై ప్రభుత్వం జరుపుతున్న దర్యాప్తుపట్ల తమకు పూర్తి నమ్మకం ఉందని స్పష్టం చేశారు. ఇద్దరూ వేర్వేరుగా వీడియో ప్రకటన విడుదల చేశారు. కిరణ్ తన వీడియో లో ప్రవీణ్ పగడాల మృతిపై ప్రభుత్వం సత్వరం స్పందించి పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించిం దని పేర్కొన్నారు. అత్యుత్సాహంతో సొంత దర్యాప్తు చేస్తున్న వారందరూ సొంత దర్యాప్తులు ఆపా లని కోరారు. ఇది… ప్రవీణ్ పగడాల ప్రతిష్ఠను దెబ్బతీస్తోందని చెప్పారు. కొందరు యూట్యూబర్లు, బ్లాగర్లు ప్రవీణ్ పగడాల మరణంపై తప్పుడు ప్రచారం వ్యాప్తి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. మరికొం దరేమో ఆయన మరణాన్ని మతపరంగా, రాజకీయంగా వాడుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
ప్రవీణ్ పగడాలను గౌరవిస్తూ… ఇలాంటి చర్యలను ఆపివేయండి. ఆయన ఎప్పుడూ మత సామర స్యాన్నే కోరుకున్నారు. మేం ప్రభుత్వ దర్యాప్తును పూర్తిగా విశ్వసిస్తున్నాం. దయచేసి ఎవరూ మత సామరస్యాన్ని చెరిపివేయవద్దని కిరణ్ కోరారు. అదే విధంగా ప్రవీణ్ సతీమణి జెస్సికా సైతం ఇదే తరహాలో స్పందించారు. తమకు మద్దతుగా నిలబడిన క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ ధన్య వాదాలు చెప్పారు. ఇలాంటి సమయంలో మాకు మీ సహకారం అవసరమని కోరారు. ప్రవీణ్ పగ డాల ఒక మంచి భర్త, మంచి తండ్రిగా పేర్కొన్నారు. ఆయన భౌతికంగా లేరని తెలిశాక…తాము అనుభవిస్తున్న బాధను అందరూ అర్థం చేసుకోవాలని కోరారు. ప్రవీణ్ పగడాల మృతిపై ప్రభు త్వం వేగంగా స్పందించి, పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించిందని చెప్పారు. దర్యాప్తుపై తమకు నమ్మకముందని.. దయచేసి ఎవరూ మత సామరస్యాన్ని దెబ్బతీయవద్దని కోరారు.
తన భర్త మత సామరస్యాన్నే కోరుకున్నారని,దానిని దెబ్బతీయాలనే ఉద్దేశం ఆయనకు ఎన్నడూ లేదని ప్రవీణ్ సతీమణి జెస్సికా వెల్లడించారు. ఇక, ఇటు పాస్టర్ పగడాల ప్రవీణ్‌కుమార్ పడుతూ లేస్తూ వరుస ప్రమాదాలకు గురైనట్టు సీసీటీవీ కెమెరా మరో ఫుటీజీ బయటకు వచ్చింది. చిల్లకల్లు టోల్‌గేట్ సమీపంలోనూ ఆయన బుల్లెట్ నడుపుతూ అదుపుతప్పి రోడ్డుపై పడిపోయిన మరో ఫుటేజీ బయట పడింది. కీసర టోల్‌గేట్ వద్ద బుల్లెట్ అదుపుతప్పి పడిపోయింది. అక్కడ ఆయనకు ప్రాథమిక వైద్యం చేసిన అంబులెన్స్ సిబ్బంది దీనికిముందు మరో ప్రమాదానికి గురైనట్టు తెలిపారు. ఆ మేరకు చిల్లకల్లు టోల్‌గేట్ దాటడానికి ముందే జరిగిన ప్రమాదానికి సంబంధించిన సీసీ ఫుటేజీ తాజాగా విడుదలైంది. ముందు వెళ్తున్న లారీ ట్యాంకర్‌ను ఓవర్ టేక్ చేయబోయి ప్రవీణ్ అదుపుతప్పి రోడ్డుపై పడిపోయారు. ఫుటేజీలన్నింటినీ పరిశీలిస్తున్న పోలీసులు.. పాస్టర్ ప్రవీణ్‌కుమార్ వరుస ప్రమాదాలకు గురైనట్టు విచారణలో గుర్తించారు