హైందవ ధర్మ పరిరక్షణ కోసం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఈయన తన బాధ్యతల కంటే కూడా సనాతన ధర్మం గురించి పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే గతంలో సనాతన ధర్మాన్ని కాపాడటం కోసమే ఈయన దీక్షలు కూడా చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ టూర్ ప్లాన్ చేశారని తెలుస్తోది.
ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ పలు ఆధ్యాత్మిక ఆలయాలను సందర్శించబోతున్నారని తెలుస్తోంది. ఈ సనాతన ధర్మ టూర్ ప్రారంభానికి కూడా ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 12వ తేదీ నుంచి కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో నాలుగు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పవన్ వివిధ ఆలయాలను సందర్శించనున్నారు.
అనంతపద్మనాభ స్వామి ఆలయం, మధుర మీనాక్షి ఆలయం, శ్రీ పరుసరామస్వామి ఆలయం,…