దక్షిణాది రాష్ట్రాల్లో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. ఈనెల 12వ తేది నుంచి కేరళ, తమిళనాడులో పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. 4 రోజుల పాటు వివిధ దేవాలయాలను సందర్శించనున్నారు. ఈ నెల 12వ తేది నుంచి 14వ తేది వరకు పవన్ కల్యాణ్ పర్యటన కొనసాగనుంది.
అందులో భాగంగా కేరళలోని అనంతపద్మనాభ స్వామి, తమిళనాడులోని మధుర మీనాక్షి, శ్రీ పరుశురామస్వామి, అగస్థ్య జీవసమాధి, కుంభేశ్వర దేవాలయం, స్వామిమలైయ్, తిరుత్తణి సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయాలను దర్శించుకోనున్నారు. సనాతనధర్మ పరిరక్షణలో భాగంగా పవన్ పర్యటనకు ప్రాధాన్యత పెరిగింది. ఇటీవలే వైరల్ ఫీవర్‌తో బాధపడిన పవన్ కల్యాణ్ కోలుకోవడంతో ఈ ఆధ్యాత్మిక యాత్ర చేపట్టనున్నారు.