జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అతని చిన్న కుమారుడు అకస్మాత్తుగా జరిగిన ఓ అగ్నిప్రమాదంలో గాయపడ్డట్టు సమాచారం. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైనప్పటికీ ప్రాణాపాయం లేదని వైద్యులు తెలుపుతున్నారు.గాయాల తీవ్రత దృష్ట్యా అత్యుత్తమ వైద్యం అందించేందుకు కుటుంబసభ్యులు కుమారుణ్ని సింగపూర్‌కి తరలించారు. దీంతోపాటు ఏపీ డిప్యూటీ సీఎం కూడా పవన్ కుటుంబానికి అండగా ఉండేందుకు హుటాహుటిన సింగపూర్ బయల్దేరినట్లు సమాచారం.ఈ ఘటనపై అభిమానుల మధ్య ఆందోళన మొదలైంది. పవన్ అభిమానులు చిన్నారి త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో ప్రార్థనలు చేస్తున్నారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కుటుంబ ప్రైవసీని గౌరవిస్తూ పూర్తి వివరాలు గోప్యంగా ఉంచుతున్నారు.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడు. మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చేతులు, కాళ్ళకు గాయాలయ్యాయి. అదే విధంగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బందులకు లోనయ్యాడు. మార్క్ శంకర్ ను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్న శ్రీ పవన్ కల్యాణ్ కి ఈ విషయం తెలిసింది. పర్యటన నిలుపుదల చేసి సింగపూర్ వెళ్లాలని అధికారులు, నాయకులు సూచించారు. ‘అరకు సమీపంలోని కురిడి గ్రామం సందర్శిస్తానని ఆ గ్రామ గిరిజనులకు నిన్న మాట ఇచ్చానని… కాబట్టి ఆ గ్రామం వెళ్ళి వారితో మాట్లాడి అక్కడి సమస్యలు తెలుసుకొంటానని శ్రీ పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అదే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభానికి ఏర్పాట్లు చేసినందున వాటిని పూర్తి చేసి వెళ్తానని తెలిపారు. మన్యంలో పర్యటన ముగించుకొని పవన్ కల్యాణ్ విశాఖ చేరుకుంటారు. అక్కడి నుంచి సింగపూర్ వెళ్ళేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.