బాలీవుడ్ లో సీరియల్స్ చేస్తూ ఉన్న భామని ఆరెక్స్ 100 తో టాలీవుడ్ కి పరిచయం చేశాడు డైరెక్టర్ అజయ్ భూపతి. పాయల్ రాజ్ పుత్ చేసిన ఆరెక్స్ 100 సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఐతే పాయల్ కన్నా ముందు అజయ్ ఈ పాత్ర చేయాలని తెలుగులో అప్పటికే పాపులారిటీ సంపాదించిన కొందరు హీరోయిన్స్ ని అడిగాడు. కానీ వాళ్లంతా ఆ పాత్రని రిజెక్ట్ చేశారు. ఐతే పాయల్ మాత్రం ఇలాంటి సినిమాతో ఎంట్రీ బాగుంటుందని ఆలోచించి పిక్ చేసుకుంది.
ఇక ఆరెక్స్ 100 సినిమా రిలీజ్ తర్వాత పాయల్ రాజ్ పుత్ టాలీవుడ్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆ సినిమాలో హీరోయిన్ పాత్ర పాయల్ తప్ప వేరే ఎవరైనా నాట్ సూటబుల్ అనేలా చేసింది. ఐతే ఆరెక్స్ 100 తర్వాత పాయల్ కి మళ్లీ అదే తరహా పాత్రలు రావడం జరిగింది. ఐతే ఒకటి రెండు పర్వాలేదు కానీ తనని అందరు అలానే చూస్తున్నారని పాయల్ ఫీలైంది.
కొన్ని సినిమాల్లో మంచి రోల్స్ పడినా అవి సరిగా ఆడకపోవడంతో అమ్మడు కెరీర్ లో వెనకపడింది. ఐతే మళ్లీ ఆరెక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతితోనే మంగళవారం సినిమా చేసింది పాయల్ రాజ్ పుత్. ఆ సినిమాలో తన నటనతో మెస్మరైజ్ చేసింది అమ్మడు. అదేంటో పాయల్ లో కొత్త కోణాన్ని.. ఆమె లోని నటిని అజయ్ భూపతి మాత్రమే గొప్పగా చూపించగలుగుతున్నాడు. ఈ విషయంలో అజయ్ భూపతికి క్రెడిట్ ఇవ్వాల్సిందే. మంగళవారం సినిమాలో పాయల్ నటనతో ఇంప్రెస్ చేసింది. ఐతే ఆ తర్వాత మళ్లీ కెరీర్ ఊపందుకుంటుందని అనుకోగా పెద్దగా ఛాన్స్ లు రాలేదు. ఐతే పాయల్ ఫ్రీ టైం లో ఎక్కువగా ఫోటో షూట్స్ చేస్తూ కాలం వెళ్లదీస్తుంది. అమ్మడు ఈమధ్య కాలంలో సినిమాల్లో కన్నా ఫోటో షూట్స్ లోనే ఎక్కువ కనిపిస్తుంది. అది పాయల్ ఫ్యాన్స్ కి కాస్త అసంతృప్తిగా ఉంది. అఫ్కోర్స్ సిల్వర్ స్క్రీన్ మీద చేసే గ్లామర్ షో కన్నా ఫోటో షూట్స్ తోనే ఫాలోవర్స్ ఎక్కువ ఎంటర్టైన్ అవుతున్నారు. అయినా కూడా పాయల్ ని మళ్లీ తర మీద చూడాలని ఉత్సాహ పడుతున్నారు. మంగళవారం 2 ఉంటుందని న్యూస్ వినిపిస్తున్నా అందులో పాయల్ ఉంటుందా లేదా కొత్త హీరోయిన్ ని తీసుకొస్తారా అన్న డౌట్ ఉంది.