గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బుచ్చి బాబు కాంబినేషన్ లో వస్తున్న భారీ సినిమా పెద్ది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఏ.ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఐతే ఈ సినిమాలో చరణ్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఆల్రెడీ దేవర సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వి కపూర్ రెండో సినిమాగా పెద్ది చేస్తుంది. ఇక పెద్ది సినిమా ఫస్ట్ లుక్ టీజర్ తోనే బుచ్చి బాబు తన మార్క్ ఏంటో చూపించాడు.
ఉప్పెన తర్వాత బుచ్చి బాబు చేస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా భారీ స్థాయిలో ఉండబోతుందని తెలుస్తుంది. పెద్ది సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారు. సినిమా నుంచి పెద్ది ఫస్ట్ షాట్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. రికార్డుల లెక్క తేల్చేలా పెద్ది పక్కా బ్లాక్ బస్టర్ అనేలా ఉంటుందని మెగా ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు.ఐతే పెద్ది సినిమాలో స్పెషల్ ఐటం సాంగ్ ఒకటి ప్లాన్ చేస్తున్నారట. ఈ సాంగ్ మాత్రం వేరే లెవెల్ లో ఉండేలా చూస్తున్నారట. పెద్ది సినిమా విషయంలోఈ ఐటెం సాంగ్ కూడా మరో హైలెట్ అనిపించేలా ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే పెద్ది సాంగ్స్ ని రెహమాన్ కంపోజింగ్ రెడీ చేయగా సాంగ్స్ సిద్ధం చేయడమే తరువాయని తెలుస్తుంది. తెలుగులో రెహమాన్ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ చేస్తున్న సినిమాగా కూడా పెద్ది ఆల్బం మీద హ్యూజ్ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.
పెద్ది సినిమా లో చరణ్ ఆటకూలీగా కనిపిస్తాడని టాక్. సినిమాలో కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. సినిమాలో ఆయన పాత్ర కూడా అదిరిపోతుందని అంటున్నారు. గేమ్ ఛేంజర్ తో అంచనాలను అందుకోలేని రామ్ చరణ్ ఈసారి పెద్దిగా బ్లాక్ బస్టర్ టార్గెట్ తో వస్తున్నాడని తెలుస్తుంది. పెద్ది సినిమాను నెక్స్ట్ ఇయర్ మార్చి ఎండింగ్ కి రిలీజ్ లాక్ చేశారు. తప్పకుండా ఈ మూవీ మరోసారి టాలీవుడ్ మాస్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసేలా ఉంటుందని అంటున్నారు. చరణ్ పెద్ది సినిమా ఫస్ట్ షాట్ తోనే మెగా ఫ్యాన్స్ సినిమా రేంజ్ ఏంటన్నది తెలుసుకోగా రిలీజ్ తర్వాత రికార్డులు షేక్ చేయడం ఖాయమని ఫిక్స్ అయ్యారు. చరణ్ పెద్దిపై ఉన్న ఈ అంచనాలను అందుకుంటుందా లేదా అన్నది చూడాలి.