పోలవరం సుదీర్ఘంగా పెండింగ్‌లో ఉన్న అంశం. ప్రధాని మోదీ వచ్చాక ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి’ అని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ తెలిపారు. శుక్రవారం లోక్‌సభలో జలశక్తిశాఖ గ్రాంట్ల డిమాండ్లకు సంబంధించిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టుకు గత ప్రభుత్వాలు చేసింది శూన్యమని అన్నారు. ‘2015లో రూ.15 వేల కోట్లకు పైగా ప్రధాని మోదీ పోలవరానికి ఇచ్చి పనులు ప్రారంభించారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనూ రూ.12 వేల కోట్లకు పైగా నిధులు కేయించారు. ఈ ప్రాజెక్ట్ పూర్తియితే 2.91 లక్షల హెక్టార్ల పంట సాగవుతుంది. అలాగే విశాఖపట్నానికి తాగు నీరు, పరిశ్రమలకు నీళ్లు లభిస్తాయి. 540 గ్రామాలకు తాగునీరు లభిస్తుంది. 28.5 లక్షల మంది ప్రజలకు లాభం జరగనుంది. నిర్మాణానికి సంబంధించిన నిధులను కేంద్రం ఎప్పటికప్పుడు సమకూర్చుతుంది’ అని మంత్రి పాటిల్ వివరించారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ లోక్‌సభలో కీలక ప్రకటన చేశారు. జలశక్తి శాఖ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్‌కి సమాధానంగా కీలక వివరాలు వెల్లడించారు. అనేక ప్రభుత్వాలు వచ్చినా పోలవరం నిర్మాణానికి ఏమీ చేయలేదని విమర్శించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం చ్చాక రూ. 15 వేల కోట్లు కేటాయించి పనులు మొదలుపట్టామి కేంద్రమంత్రి తెలిపారు.
వేసవి కాలం వస్తున్న క్రమంలో జలవనరుల శాఖ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కేసీ కెనాల్ ఆయకట్టు, నాగార్జునసాగర్ కుడి, ఎడమ కాలువల ఆయకట్టు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల ఆయకట్టు పంటలకు పూర్తిస్థాయిలో నీరు అందించాలని మంత్రి నిమ్మల అధికారులను ఆదేశించారు.
నంద్యాల, పల్నాడు, ప్రకాశం, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల కలెక్టర్లకు సాగునీరు సరఫరాపై ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని మంత్రి ఆదేశించారు. రెవెన్యూ, ఇరిగేషన్ విభాగాలను సమన్వయం చేసుకుంటూ పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఆఖరి ఎకరం వరకు నీరు అందించాలని మంత్రి నిమ్మల స్పష్టం చేశారు.
రబీ సీజన్ ముగుస్తుండడంతో ఎస్ఈ స్థాయి అధికారుల నుంచి ఈఈ లు, డీఈఈ లు, ఏఈఈల వరకు క్షేత్రస్థాయిలో ఉండి సాగునీరు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ని్మల రామానాయుడు ఆదేశించారు. రబీ పంటకు రానున్న 10, 15 రోజుల్లో రైతులకు సాగునీరు అందించేలా యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవాలన్నారు. కాలువల పూడికలు, తూడు, లాకుల మరమ్మతులు వంటి సమస్యలను అధిగమించి రైతుల పంటను కాపాడాలని సూచించారు.
మరోవైపు, అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానం ఇచ్చారు. మార్చి 25వ తేదీన జరిగే కలెక్టర్ల సమావేశంలో ల్యాండ్ కన్వర్షన్ వివరాల సేకరణకు శ్రీకారం చుట్టి, 2 నెలల్లో పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం 4 కోట్ల ఎకరాల భౌగోళిక విస్తీర్ణంలో దాదాపు 2 కోట్ల ఎకరాలు సాగుకు అనుకూలమైన భూములున్నాయని తెలిపారు. బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు మరిన్ని ఎకరాలకు సాగు నీరు అందించే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి తెలిపారు.