కన్నడ నటి రణ్యా రావు బంగారు స్మగ్లింగ్ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఇటీవల ఆమెను దుబాయ్ నుంచి బెంగళూరుకు చేరుకున్న వెంటనే DRI అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అప్పట్లో ఆమె వద్ద 14.2 కిలోల బంగారం దొరికిందని, దాని విలువ రూ.12.56 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఇంట్లో జరిగిన సోదాల్లో కూడా బంగారు ఆభరణాలు, భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు.
విచారణలో రణ్యా కొన్ని షాకింగ్ విషయాలు వెల్లడించిందని సమాచారం. ఆమె మాట్లాడుతూ, స్మగ్లింగ్ అనేది కొత్త విషయమని, ఈ పని ఎలా చేయాలో యూట్యూబ్ చూసి నేర్చుకున్నానని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే, విచారణ సమయంలో పూర్తి సహకారం అందించలేదని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆమె బెయిల్ పిటిషన్ ప్రత్యేక ఆర్థిక నేరాల కోర్టులో పెండింగ్‌లో ఉంది.
ఈ కేసులో అధికారిక భద్రతా ప్రోటోకాల్‌ను తప్పుగా ఉపయోగించినట్లుగా ఆరోపణలు వచ్చాయి. విమానాశ్రయంలో ఉన్న భద్రతా వ్యవస్థను ఆమె ఎలాగైనా మోసం చేసిందని, అధికారుల ప్రోత్సాహం లేకుండా ఇది సాధ్యమేనా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో రాజకీయ నాయకుల ప్రమేయం కూడా ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ దీనిని ఖండించారు.
ఇప్పటికే ఈ కేసుపై CBI, DRI సంయుక్తంగా దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. రణ్యా వెనుక పెద్ద నెట్‌వర్క్ ఉందా? లేక ఒంటరిగా ఆమె ఈ వ్యవహారాన్ని నడిపించిందా? అనే విషయాలు త్వరలోనే స్పష్టతకు వస్తాయని తెలుస్తోంది. సీఎం సిద్ధరామయ్య ఈ కేసుపై ప్రత్యేక దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఇటీవల కన్నడ నటి రన్యారావు బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయంలో దాదాపు 14.2 కిలోల బంగారం అక్రమ రవాణా చేస్తూ కస్టమ్స్ శాఖ వారికి పట్టుబడ్డారు. దీని విలువ దాదాపు రూ. 12.5 కోట్లు అంతేకాదు ఆమె వద్ద నుంచి మరో 4.73 కోట్ల రూపాయల విలువైన ఇతర వస్తువులను కూడా జప్తు చేసుకున్నారు. అయితే పోలీసుల విచారణలో రన్యా రావు ఒక అంతర్జాతీయ స్మగ్లింగ్ నెట్వర్క్ లో భాగస్వామ్యం అయి ఉన్నారని అనుమానిస్తున్నారు అంతేకాదు ఆమె వెనుక ఎవరున్నారు అనే దాని పైన తీవ్రంగా విచారణ జరుపుతున్నారు. నిజానికి మన దేశంలోకి దుబాయ్ నుంచి ఎక్కువగా అక్రమ బంగారం అనేది వస్తూ ఉంటుంది. సాధారణంగా స్థానికంగా ఉండే కొంతమంది వ్యాపారులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన బంగారం దిగుమతి సుంకాలను ఎగ్గొట్టేందుకు దుబాయ్ నుంచి బంగారాన్ని అక్రమంగా దిగుమతి చేసుకుంటారు వీరికి అంతర్జాతీయ స్మగ్లర్లు సహాయం చేస్తుంటారు. తరచూ హైదరాబాద్ విమానాశ్రయంలోనూ బెంగళూరు విమానాశ్రయంలోనూ ముంబై లోను ఇలా అంతర్జాతీయ విమానాశ్రయాల్లో పెద్ద ఎత్తున బంగారం పట్టు పడటం గమనించవచ్చు. అయితే ఇప్పుడు మనకు ఒక సందేహం రావచ్చు విదేశాల నుంచి మనం కూడా తరచూ స్వదేశానికి వస్తున్నప్పుడు అక్కడి నుంచి బంగారం తెచ్చుకుంటే ఇలాగే పట్టుబడతామా అని మీకు సందేహం కలగవచ్చు. అయితే పరిమితికి మించి బంగారం తెచ్చినప్పుడు మాత్రమే కస్టమ్స్ శాఖ వారు అరెస్టు చేస్తుంటారు. పరిమితికి లోబడి బంగారు ఆభరణాలను దుబాయి నుంచి స్వేచ్ఛగా తెచ్చుకునే అవకాశం ఉంది. ఎంత పరిమితికి లోబడి దుబాయ్ నుంచి బంగారం తెచ్చుకోవచ్చు ఇప్పుడు తెలుసుకుందాం.
భారతీయులు దుబాయ్ నుంచి బంగారం తెచ్చుకునే విషయంలో పురుషులకు స్త్రీలకు వేరువేరుగా నిబంధనలు ఉన్నాయి.దుబాయ్ నుంచి భారతదేశానికి వచ్చే పురుషులు గరిష్టంగా 50 వేల రూపాయల విలువైన బంగారు ఆభరణాలను తెచ్చుకోవచ్చు. అయితే బంగారం బిస్కెట్లు, కడ్డీలను తెచ్చుకోవడానికి వీలు లేదు. అయితే మీ శరీరంపైన 50 వేల కన్నా ఎక్కువ విలువైన బంగారం ఉంటే దాని రశీదుని చూపించాల్సి ఉంటుంది. లేదా కస్టమ్స్ డ్యూటీని చెల్లించాలి. బిల్లు లేకుండా ఉంటే కస్టమ్స్ అధికారులు బంగారం స్వాధీనం చేసుకునే వీలుంది.
దుబాయ్ నుంచి భారతదేశానికి వచ్చే మహిళలు గరిష్టంగా ఒక లక్ష రూపాయలు విలువైన బంగారు ఆభరణాలు ధరించవచ్చు కానీ. బంగారం బిస్కెట్లు కాయలు కడ్డీలు వంటివి తెచ్చుకోకూడదు. . ఇక 12 సంవత్సరాల లోపు పిల్లలు గరిష్టంగా 25 వేల రూపాయల విలువైన బంగారం తెచ్చుకోవచ్చు.
ఒకవేళ పరిమితికి మించి బంగారం ఉన్నట్లయితే, మీరు కస్టమ్స్ డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది. జరిమానా లేదా 36 శాతం కస్టమ్స్ డ్యూటీ చెల్లించాల్సి రావచ్చు. ఒకవేళ అత్యధిక పరిమితి అంటే 500 గ్రాములకు మించి బంగారం ఉన్నట్లయితే కస్టమ్స్ వారు ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ఇక బంగారం డిక్లేర్ చేయకుండా అక్రమ రవాణా చేస్తే మాత్రం జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది. అలాగే మనీ లాండరింగ్ కేసులు కూడా పెడతారు.