ప్రస్తుతం టెక్నాలజీ యుగం నడుస్తోంది. కూర్చున్న చోట నుంచే అన్నీ పనులు అయిపోయేలా సాంకేతికత అభివృద్ధి చెందింది. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి UPI యాప్స్ ద్వారా పెమెంట్స్ చెల్లించే అవకాశం ఉంది. అయితే.. చాలా మంది కరెంట్ బిల్ కట్టాలంటే దగ్గర్లోని కరెంట్ ఆఫీస్‌కి వెళుతుంటారు. లేదా ఎవరినో ఒకరిని బ్రతిమాలుతుంటారు ఆన్‌లైన్‌లో బిల్ కట్టమని. అయితే ప్రస్తుతం వేరే వాళ్లని అడగాల్సిన అవసరం లేకుండా మీ ఫోన్ నుంచి రెండు నిమిషాల్లో కరెంట్ బిల్ ఎలా కట్టాలో తెలుసుకుందాం…
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త రూల్స్ అమలులోకి వచ్చాయి. ఈ కొత్త రూల్స్ ప్రకారం ఆన్‌లైన్‌లో కరెంట్ బిల్లులు కట్టడానికి థర్డ్ పార్టీ UPI యాప్స్‌కు బదులుగా గవర్నమెంట్ వెబ్‌సైట్‌ల ద్వారా సింపుల్‌గా చెల్లించవచ్చు.
దీనికోసం.. ఆంధ్రప్రదేశ్ బిల్లులు.. ఏపీఈపీడీసీఎల్ (ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి) https://www.apspdcl.in/index.jsp లేదా ఏపీఎస్‌పీడీసీఎల్ (ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూల్, అనంతపురం) https://www.apeasternpower.com/ లేదా ఏపీసీపీడీసీఎల్ (ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, విజయవాడ) https://apcpdcl.in/ వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా చెల్లించవచ్చు.
ఇక తెలంగాణ వినియోగదారులు https://tgsouthernpower.org/ లేదా https://tgnpdcl.com/ వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా నేరుగా కరెంట్ బిల్స్ పే చేయవచ్చు. ఈ సైట్ నుండి లేదా యాప్ నుంచి మీ సర్వీస్ నెంబర్‌ను ఎంటర్ చేసి కరెంట్ బిల్‌ను పే చేయవచ్చు.
వెబ్‌సైట్ నుంచి కరెంట్ బిల్ పే చేయాలంటే.. మొదట మీ పరిధిలోని విద్యుత్ పంపిణీ సంస్థ వెబ్‌సైట్ ద్వారా.. పే బిల్ నౌ, బిల్ పే వంటి ఆప్షన్లు ఉంటాయి. ఈ ఆప్షన్ ఎంచుకోండి. ఇందులో మీ యూనిక్ సర్వీస్ నెంబర్ మరియు క్యాప్చా ఎంటర్ చేయగానే మీ బిల్ వివరాలు వస్తాయి. స్క్రీన్ మీద వివరాలు కనిపిస్తాయి. వాటిని చెక్ చేసుకుని.. Current Month Bill సెక్షన్లో Click Here to Pay ఆప్షన్పై క్లిక్ చేయాలి. అప్పుడు మీకు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో పేమెంట్ చేయడానికి రకరకాల ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి.
అందులో ఏదో ఒక దానిని సెలక్ట్ చేసుకోవాలి. కొత్త విండో ఓపెన్ అవుతుంది. అందులో Postpaid ఆప్షన్పై క్లిక్ చేసి USC నెంబర్ ఎంటర్ చేసి Fetch Bill ఆప్షన్పై క్లిక్ చేయాలి. వివరాలు అన్ని స్క్రీన్ మీద కనిపిస్తాయి. అవి వెరిఫై చేసుకుని Proceed to Pay ఆప్షన్పై క్లిక్ చేసి పేమెంట్ చేయాలి. పేమెంట్ కోసం క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, వాలెట్, UPI యాప్ ద్వారా కూడా అమౌంట్ చెల్లించవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు చోట్ల చిన్న చిన్న మార్పులతో దాదాపు ఇదే ప్రాసెస్ ఉంటుంది.
మరో సింపుల్ ప్రాసెస్.. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చెల్లించడం
ప్రస్తుతం కరెంట్ బిల్లులపై QR Code ముద్రించి ఉంటుంది. వినియోగదారులు ఆ కోడ్‌ని స్కాన్ చేసి సులువుగా కరెంటు బిల్లు కట్టేయొచ్చు. బిల్లు కింద వచ్చే క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి మనకు నచ్చిన పేమెంట్ యాప్ ద్వారా కరెంటు బిల్లును చెల్లించవచ్చు. వినియోగదారులు తమ మొబైల్ ద్వారా క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి డెబిట్, క్రెడిట్ కార్డులు, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ తదితర విధానాల్లో బిల్లులను చెల్లించే వెసులుబాటు ఉంటుంది.