రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లిపై మరో క్రేజీ విషయం బయటకొచ్చి వైరల్ అవుతోంది. తాజాగా సమాచారం మేరకు ఈ ఏడాదే ప్రభాస్ పెళ్లి ఉండనుందని తెలుస్తోంది.సినీ నటుల వ్యక్తిగత జీవితాలు నిత్యం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంటాయి. మరీ ముఖ్యంగా నటీనటుల ప్రేమ, పెళ్లి సంగతులపై నెట్టింట జరిగే చర్చలు అన్నీఇన్నీ అని చెప్పలేం. పెళ్లి విషయంలో హాట్ టాపిక్ అవుతున్న టాలీవుడ్ హీరోల్లో ప్రభాస్ దే మొదటి స్థానం అని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.
కృష్ణం రాజు నట వారసుడిగా వెండితెరపైకి వచ్చి తనకంటూ స్పెషల్ ఇమేజ్ కూడగట్టుకున్న ప్రభాస్.. అంచెలంచెలుగా ఎదుగుతూ పాన్ ఇండియా స్టార్ అయ్యారు. బాహుబలి లాంటి సినిమాతో వరల్డ్ వైడ్ ఫ్యాన్ బేస్ కూడగట్టుకున్నారు. ఇదంతా ఒకెత్తయితే ప్రభాస్ పెళ్లి మ్యాటర్ మరో ఎత్తు.నాలుగు పదుల వయసొచ్చినా ఈ టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పెళ్లి చేసుకోకపోవడంతో అందరి కళ్ళు ఇతగాడిపైనే ఉన్నాయి. ప్రభాస్ ప్రేమలో ఉన్నారని, హీరోయిన్ అనుష్కతో సీక్రెట్ ఎఫైర్ నడిపిస్తున్నారనే వార్తలకైతే కొదవేలేకుండా పోయింది.
ప్రభాస్- అనుష్క అతి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. అలాంటిదేం లేదని దీనిపై అనుష్క, ప్రభాస్ రియాక్ట్ అయినప్పటికీ ఈ వార్తల ప్రవాహం ఆగడం లేదు. ఇంతలో తాజాగా రెబల్ స్టార్ ఫ్యామిలీ నుంచి మరో బిగ్ సీక్రెట్ బయటకొచ్చింది. ప్రభాస్ పెళ్లి ఫిక్స్ అయిందని, ఈ వ్యవహారాన్ని అంతా సీక్రెట్ గా నడిపిస్తున్నారనే టాక్ నడుస్తోంది.అయితే ప్రభాస్ పెళ్లి చేసుకోబోయేది అనుష్కను కాదట. హైదరాబాద్ కి చెందిన ఓ బడా బిజినెస్ మెన్ కూతురు అని అంటున్నారు. కృష్ణం రాజు భార్య శ్యామలా దేవి ఓ పెద్దింటి అమ్మాయిని చూసి లోలోపలే ప్రభాస్ పెళ్లి పనులు మొదలు పెట్టారనే సమాచారం అయితే వైరల్ అవుతోంది.
ఇలా ప్రభాస్ పెళ్లిపై పుకార్లు పుట్టడం కొత్తేమీ కాకపోయినా.. తాజాగా వినిపిస్తున్న సమాచారంలో ఎంతోకొంత నిజం ఉండే ఉండొచ్చు అని ఇంకొందరు చెప్పుకుంటున్నారు. ఇప్పటికే 45ఏళ్ల వయసు వచ్చేసింది కాబట్టి ఇక ప్రభాస్ పెళ్లి ఖచ్చితంగా జరిగే అవకాశం ఉందని అంటున్నారు.మరోవైపు ప్రస్తుతం ప్రభాస్ తన సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. రీసెంట్ గానే కల్కి సినిమా చేసిన ఆయన.. ప్రస్తుతం ది రాజాసాబ్, ఫౌజీ సినిమాల్లో నటిస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్‌తో బిజీగా ఉన్న ప్రభాస్.. త్వరలోనే మరో భారీ సినిమా ‘స్పిరిట్’ సెట్‌లోకి కూడా అడుగుపెడతారని తెలుస్తోంది.
ఉగాది కానుకగా ఈ ప్రాజెక్ట్‌ను లాంచ్ చేయాలని సందీప్ రెడ్డి ఫిక్స్ చేసినట్లు సమాచారం. స్క్రిప్ట్‌తో పాటు మ్యూజిక్ వర్క్ కూడా దాదాపు పూర్తి కావడంతో, ఆలస్యం చేయకుండా సినిమాను ప్రారంభించాలని సందీప్ రెడ్డి నిర్ణయించుకున్నాడట. అయితే రెగ్యులర్ షూటింగ్ మొదలవడానికి కొంత సమయం పట్టనుందని తెలుస్తోంది.