పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ సృష్టించిన పుష్ప 2 టీవీ ప్రీమియర్ టీఆర్పీ మాత్రం ఆశించిన స్థాయికి చేరకపోవడం చర్చనీయాంశంగా మారింది. బాక్సాఫీస్ వద్ద దాదాపు ₹1800 కోట్లు గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా, ఓటీటీ వేదికలపై కూడా రికార్డు స్థాయిలో వ్యూస్ సాధించింది. కానీ మొదటి టీవీ ప్రసారంలో కేవలం 12.61 టీఆర్పీ మాత్రమే రావడం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.ఇది అల్లు అర్జున్ కెరీర్‌లో ఓ డిజాస్టర్‌గా నిలిచిన నా పేరు సూర్య టీఆర్పీ (12)తో సమానంగా ఉండటం గమనార్హం. గతంలో అల వైకుంఠపురములోకు 29.4 టీఆర్పీ, పుష్ప: ది రైజ్కు 22.54, డీజేకు 21.7 టీఆర్పీ లభించాయి. దీంతో టీవీ ప్రేక్షకుల మద్దతులో తక్కువగా పడినట్లు అర్థమవుతోంది.
ఈ ఫలితానికి ప్రధాన కారణంగా ఓటీటీ వేదికలపై ముందుగానే సినిమా లభించడమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మిలియన్ల మంది ఓటీటీలో చూసిన నేపథ్యంలో టీవీ ప్రీమియర్‌పై ఆసక్తి తగ్గినట్లు తెలుస్తోంది. అంతేకాదు, సినిమా నిడివి ఎక్కువగా ఉండటం, మధ్యలో యాడ్స్ వల్ల టీవీ ఆడియెన్స్ ఆసక్తి కోల్పోయిన అవకాశం కూడా ఉందని చెప్పుకుంటున్నారు.ఇది చూస్తే, టీఆర్పీ పరంగా ఓ సినిమా విజయం కొద్దిగా ప్రభావితం కావచ్చు కానీ, థియేటర్లలో వసూళ్లు, ఓటీటీ వ్యూస్ ప్రస్తుతం ఎక్కువగా ప్రాధాన్యతకు వచ్చాయని తేలుతోంది. బన్నీకి థియేటర్లలో ఇప్పటికీ మాస్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ, టీవీ ప్రేక్షకుల స్పందనలో తేడా కనిపించడాన్ని పరిశీలకులు ఆసక్తిగా గమనిస్తున్నారు. అయితే అభిమానులకు ఇది తాత్కాలిక నిరాశే అయినా, సినిమా స్థాయికి ఏమాత్రం తగ్గేదేం కాదనడంలో సందేహం లేదు.
పుష్ప చిత్రంతో ఐకాన్ స్టార్‌గా మారిన అల్లు అర్జున్ ఆ తర్వాత పుష్ప 2తో గ్లోబల్ స్టార్‌గా మారాడు. పుష్ప2 చిత్రం అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో తెరకెక్కి సంచలనం క్రియేట్ చేసింది. భారీ అంచనాలతో డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా తొలి రోజు రూ. 294 కోట్ల ఓపెనింగ్స్ అందుకుంది. బాక్సాఫీస్ దగ్గర రూ. 1850 కోట్లను వసూలు చేసి నయా రికార్డులను క్రియేట్ చేసింది. ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం శాటిలైట్ ఛానల్ లో ప్రీమియర్ అవుతున్నప్పుడు భారీ రేటింగ్స్ వస్తాయని అందరు అనుకున్నారు. ఇక టీమ్ కూడా విస్తృతంగా ప్రమోషన్స్ చేసింది. సుకుమార్, దేవిశ్రీప్రసాద్ తదితరుల ప్రత్యేక ఇంటర్వ్యూ ఫుటేజ్ తీసుకుని ప్రసారం మధ్యలో వాటిని వదిలారు.
అయితే ఎన్ని చేసిన కూడా పుష్ప2 చిత్రం ప్రభంజనం సృష్టించలేకపోయింది. ఊహించిన దాని కన్నా కొంచెం ఆటు ఇటు రీచ్ అయ్యి అభిమానులకు, టీవీ వర్గాలకు పుష్ప2 ఊహించని షాక్ ఇచ్చింది. రిపోర్ట్స్ ప్రకారం పుష్ప 2 ది రూల్ కు వచ్చిన టిఆర్పి 12.61 మాత్రమే. ఇది మంచి నెంబరే అయిన బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన ఫలితంతో పోలిస్తే చాలా తక్కువే. గతంలో బన్నీ నటించిన అల వైకుంఠపురములో (29.4), పుష్ప ది రైజ్ (22.5), డీజే దువ్వాడ జగన్నాథం (21.7) బన్నీ చిత్రాల్లో అగ్ర స్థానంలో ఉండగా సూపర్ ఫ్లాప్ గా నిలిచిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా (12.5) కి దగ్గరగా పుష్ప 2 నెంబర్ నమోదు కావడం ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తుంది.
అయితే పుష్ప2 ప్రీమియర్ సమయంలో సంక్రాంతికి వస్తున్నాం రెండోసారి జీ ఛానల్ లో రావడం కొంత ఎఫెక్ట్ చూపించింది. మరోవైపు ఓటిటిలు వచ్చాక మునుపటిలా కొత్త సినిమాలు టీవీలో అదే పనిగా చూడడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపడం లేదు. మరోవైపు సినిమా రిలీజ్ అయిన రోజే పైరసీ ప్రింట్ బయటకి వచ్చేస్తుంది. అక్కడే అందరు చూస్తున్నారు. అందుకే టీఆర్పీ తగ్గుతుంది. ఇలా అయితే భవిష్యత్తులో శాటిలైట్ హక్కుల డిమాండ్ మరింత కిందకు పడిపోయే అవకాశం లేకపోలేదు.