గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బుచ్చి బాబు సన కాంబినేషన్ లో వస్తున్న సినిమా పెద్ది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. అకాడమీ అవార్డ్ విన్నర్ ఏ.ఆర్ రెహమాన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. పెద్ది ఫస్ట్ షాట్ తోనే సినిమాపై భారీ హైప్ ఎక్కించేశాడు డైరెక్టర్ పెద్ది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో పీరియాడికల్ మూవీగా పెద్ది వస్తుంది. ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు.
పెద్ది సినిమా ఫస్ట్ షాట్ చూసిన ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అన్న రేంజ్ లో ఎగ్జైట్ అవుతున్నారు. ఐతే ఈ సినిమా విషయంలో ప్రతీది కూడా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తున్నాడట బుచ్చి బాబు. ఈ క్రమంలో పెద్ది సినిమాలో స్పెషల్ ఐటం సాంగ్ అది కూడా నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. పెద్ది సాంగ్సే ఒక రేంజ్ లో ఉంటాయని తెలుస్తుండగా ఈ స్పెషల్ ఐటెం సాంగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు. ఐతే పెద్ది మేనియా చూశాక తప్పకుండా ఈ స్పెషల్ ఐటెం సాంగ్ కి స్టార్ హీరోయిన్ ని తీసుకుంటారని అనుకుంటున్నారు. స్టార్ హీరోయిన్స్ కూడా సినిమాలకు ఈక్వల్ గా ఐటెం సాంగ్స్ మీద ఆసక్తి చూపిస్తున్నారు. ఐతే పెద్ది ఐటెం సాంగ్ లో నటించే హీరోయిన్ ఎవరన్న దాని మీద చర్చ మొదలైంది. పూజా హెగ్దే, రష్మిక మందన్న లాంటి హీరోయిన్స్ పేర్లు వినిపిస్తున్నాయి. ఐతే బుచ్చి బాబు ప్లానింగ్ ఎలా ఉందో చెప్పడం కష్టం.
అదీగాక సినిమా ఇంకా షూటింగ్ నడుస్తుంది. స్టార్ సినిమాలకు ఐటెం సాంగ్ ఎప్పుడైనా కూడా చివర్లో షూట్ చేస్తారు సో తప్పకుండా పెద్ది సినిమా స్పెషల్ సాంగ్ విషయంలో మేకర్స్ నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేసే ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు. ఐతే సాంగ్ చేసేది ఎవరైనా రెహమాన్ మ్యూజిక్ కి థియేటర్ దద్దరిల్లిపోవాల్సిందే అనిపించేలా ఉంటుందని అంటున్నారు. పెద్ది ఫస్ట్ షాట్ తోనే సినిమా రేంజ్ ఏంటన్నది చూపించిన రామ్ చరణ్ సినిమాతో ఏ రేంజ్ రికార్డులు బద్ధలు కొడతాడన్నది చూడాలి. 2026 మార్చి ఎండింగ్ లో పెద్ది రిలీజ్ లాక్ చేశారు. ఐతే అనుకున్న డేట్ కి సినిమా వచ్చేలా చేస్తారా లేదా అన్నది చూడాలి.