గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. ప్రముఖ రిలయన్స్ గ్రూప్స్ తో సంచలన ఒప్పందం చేసుకున్నారు. రిలయన్స్ కు చెందిన ప్రముఖ కూల్ డ్రింక్స్ బ్రాండ్ కాంపాకు అంబాసిడర్‌గా చెర్రీ వ్యవహరించనున్నారు. ఈ మేరకు ఈ విషయాన్ని రిలయన్స్ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది.
రామ్ చరణ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకోవడం కాంపా కూల్ డ్రింక్ ప్రయాణంలో ఒక మైలురాయి అని పేర్కొంది.
కాంపా బ్రాండ్ ను 2023 మార్చిలో మార్కెట్‌లోకి తీసుకొచ్చింది రిలయన్స్ గ్రూప్. మార్కెట్ లోకి వచ్చిన కొద్దికాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చకుందీ బ్రాండ్. దీన్ని ప్రపంచ వ్యాప్తంగా మరింత విస్తరించాలని ఈ మేరకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొంది. 1970, 80 దశకాల్లో దేశీయంగా పాపులర్ బ్రాండ్ అయిన కాంపా కోలాను 2022లో రిలయన్స్ సంస్థ కొనుగోలు చేసింది. 2023లో దీన్ని మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.
ఇక ఈ విషయం తెలిసిన చెర్రీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇదయ్యా నీ రేంజ్ అంటూ సామాజిక మాధ్యమాల్లో కామెంట్స్ పెడుతున్నారు. ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా మార్చి 26, 2026లో రిలీజ్ కానుంది. ఇటీవల చరణ్ బర్త్ డే సందర్భంగా వదిలిన గ్లింప్స్ అదరగొట్టింది. రికార్డు వ్యూస్ తో ఈ గ్లింప్స్ సామాజిక మాధ్యమాల్లో దూసుకెళ్తోంది.