తెలుగు చిత్రసీమలో ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి రమ్యశ్రీ. ఈ పేరు చెబితే చాలామందికి తెలియకపోవచ్చు కానీ ఆమెను చేస్తే ఎవ్వరైనా వెంటనే గుర్తు పట్టేస్తారు. ఈ నటి అసలు పేరు సుజాత. సినీ రంగ ప్రవేశ సమయంలో ఇప్పటికే అదే పేరుతో ఉన్నవారు ఉండటంతో “రమ్యశ్రీ”గా పేరు మార్చుకున్న ఈమె బోలెడన్ని సినిమాలతో మత్తెక్కిచింది.తెలుగు అమ్మాయి అయినప్పటికీ, ఆమె మొదటగా కన్నడ చిత్ర పరిశ్రమలో హీరోయిన్‌గా పరిచయమై.. అక్కడే 30కి పైగా సినిమాల్లో నటించి మంచి గుర్తింపు పొందింది.రమ్యశ్రీ నటించిన మొత్తం చిత్రాల సంఖ్య 250కి పైగా ఉంటుంది. తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ, హిందీ, భోజ్‌పురి భాషల్లో ఆమె నటన కొనసాగింది. నటిగా కెరీర్‌ను ప్రారంభించిన రమ్యశ్రీ, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించింది.
మరీ ముఖ్యంగా బోల్డ్ పాత్రలతో రమ్యశ్రీకి ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. “నువ్వు నేను”, “ఆది”, “సింహాద్రి”, “యమగోల మళ్ళీ మొదలైంది” వంటి చిత్రాల్లో ఆమె నటన ప్రశంసించదగినదే. అలాగే, అనేక సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ తో కూడా గోల పెట్టించింది.ఈవెంట్‌లకు తనను పిలవాలంటే.. ‘ఆమె బట్టలు సరిగ్గా వేసుకోదు’ అంటూ కొందరు విమర్శించే వారని చెప్పుకొచ్చింది. ఓసారి అమెరికాలో ఈవెంట్‌కు పిలిచి, తర్వాత ‘ఆమె అసభ్యంగా డ్రెస్ వేస్తుంది’ అని ఆహ్వానం వెనక్కి తీసుకున్న సందర్భంగా కూడా ఉందని తెలిపింది. అయితే కొంతమంది మాత్రం ఇలాంటి పరిస్థితుల్లో తన తరఫున నిలబడ్డారని పేర్కొంది రమ్యశ్రీ.
“సినిమాల్లో బోల్డ్‌గా కనిపిస్తున్నా, నిజ జీవితంలో నేను చాలా డీసెంట్‌గా ఉంటాను. అక్కడ నన్ను చూసినవారంతా ఆశ్చర్యపోయారు” అని చెప్పింది రమ్యశ్రీ. అయితే “ఒక పెద్దాయన ‘చీర కట్టిన ప్రతి ఆడది పతివ్రత కాదు, డ్రెస్ చూసి అంచనా వేయకూడదు’ అని చెప్పడం తనకు ఎంతో బలాన్నిచ్చింది” అని ఆమె చెప్పింది.ఇకపోతే.. తనకు బీ గ్రేడ్ సినిమాల్లో నటించమని, అశ్లీల చిత్రాల్లో నటించాలని చాలామంది ఫోర్స్ చేశారని రమ్యశ్రీ చెప్పుకొచ్చింది. “పొట్టి బట్టలు దర్శకులు చెప్పిన పాత్ర కోసం వేస్తాను, దాని అర్థం నేను అశ్లీల సినిమాల్లో నటిస్తాను అని కాదు” అంటూ స్పష్టం చేసింది.తన ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా, తన విలువలకు ఎప్పుడూ కట్టుబడి ఉన్నానని చెబుతోంది రమ్యశ్రీ. దీంతో ఆమె చెప్పిన ఈ విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఒకప్పుడు సినిమాల్లో బోల్డ్ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన వారిలో రమ్య శ్రీ ఒకరు. సినిమాల్లో విభిన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు రమ్యశ్రీ. ముఖ్యంగా బోల్డ్ పాత్రలతో ఆమె పాపులర్ అయ్యారు. తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ, హిందీ, భోజ్‌పురి భాషల్లో దాదాపు 250కి పైగా సినిమాలు చేసి మెప్పించారు ఈ స్టార్ యాక్టర్. అప్పట్లో రమ్యశ్రీకి కుర్రాళ్లలో విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది. ప్రస్తుతం రమ్య శ్రీ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. నటిగా కెరీర్‌ను ప్రారంభించిన రమ్యశ్రీ, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా అలరించింది.
రమ్యశ్రీ ఎక్కువగా శృంగార రస పాత్రలను పోషిస్తుంటుంది. నువ్వు నేను, ఆది, సింహాద్రి, యమగోల మళ్ళీ మొదలయింది లాంటి చిత్రాల్లో రమ్యశ్రీ నటించింది. అయితే బోల్డ్ పాత్రలు చేయడంతో ఆమె చాలా విమర్శలు కూడా ఎదుర్కొంది. అలాగే బోల్డ్ రోల్స్ చేయడం వల్ల చాలా మంది తనను తప్పుడు ఉద్దేశంతో చూశారని తెలిపింది. గతంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నన్ను ఈవెంట్స్ కు పిలవలనుకున్నా.. ఆమె బట్టలు సరిగ్గా వేసుకోదు ఎందుకు అని కామెంట్స్ కూడా చేశారట. అమెరికాలో ఓ ఈవెంట్ కోసం ముందుగా రమ్యను పిలిచారట.. ఆతర్వాత ఆమె అసభ్యకరంగా బట్టలు వేసుకుంటుని అని ఆమెను వద్దు కొందరు అన్నారట.. ఆ తర్వాత కొంతమంది బట్టల్లో ఏముంది.. ఇక్కడ మనం వేసుకోవడం లేదా అని సపోర్ట్ గా మాట్లాడి తనను ఇన్వైట్ చేశారు అని తెలిపింది. ఆ తర్వాత అక్కడ నన్ను చూసి అంతా షాక్ అయ్యారు. సినిమాల్లో అంత బోల్డ్ గా ఉంటారు బయట చాలా డీసెంట్ గా ఉన్నారు అని షాక్ అయ్యారు. ఓ పెద్దాయన నన్ను ఉద్దేశిస్తూ.. చీర కట్టిన ప్రతి ఆడది పతివ్రత కాదు.. డ్రెస్ ని చూసి అంచనా వేయకూడదు అని అన్నారు అని తెలిపింది. అలాగే తనకు బీ గ్రేడ్ సినిమాలో నటించమని కూడా ఆఫర్స్ వచ్చాయి అని తెలిపింది. నీలి చిత్రాల్లో నటించమని నాపై చాలా మంది ఒత్తిడి తెచ్చారు. నేను అలాంటి సినిమాలు చేయను అని గట్టిగా వాదించాను. సినిమాల్లో దర్శకులు చెప్పారని పొట్టి బట్టలు వేసుకుంటాను అంత మాత్రానా అలాంటి సినిమాలు చేయను అని అన్నారు రమ్య శ్రీ.