గత కొన్ని సంవత్సరాలుగా రాయలసీమలో ఫ్యాక్షన్ పూర్తిగా కనుమరుగవుతూ వచ్చింది కానీ ఒకసారిగా తిరిగి ఫ్యాక్షన్ తెరపైకి రావడమే కాకుండా రక్త చరిత్ర కూడా మొదలైందని చెప్పాలి. ఒకప్పుడు అనంతపురం అంటే ఫ్యాక్షన్ కి మారుపేరు. ఒకప్పుడు ఈ ఫ్యాక్షన్ కారణంగా ఒకరినొకరు చంపుకుంటూ రక్తం ఏరులై పారేది కానీ కాలక్రమేనా ఫ్యాక్షన్ తగ్గిస్తూ ఎవరి పనులలో వారు బిజీ అయ్యారు కానీ ఇప్పుడు మరోసారి ఈ రక్తపాతం మొదలైందని తెలుస్తోంది.
ఇటీవల జరిగిన ఎంపీపీ ఎన్నికలు ఇందుకు ప్రధాన కారణం అని తెలుస్తుంది. రామగిరి మండలంలో తెలుగుదేశం పార్టీ బలం లేకపోయినా అక్కడ విజయం సాధించాలి అంటూ వ్యూహాత్మకంగా పరిటాల కుటుంబం దౌర్జన్యాలకు పాల్పడింది అంటూ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఇందులో భాగంగా వైసిపికి మద్దతు తెలిపిన వారిపై పరిటాల అనుచరులు దాడి చేసిన విషయం తెలిసిందే.
ఈ దాడిలో భాగంగా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో వైసీపీ నేత లింగమయ్య మరణించారు. దీంతో తోపుదుర్తి బ్రదర్స్ పరిటాల వర్గీలపై విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే పరిటాల సునీత మీడియా సమావేశంలో తోపుదుర్తి బ్రదర్స్ గురించి విమర్శలు చేయడమే కాకుండా పరిటాల రవి హత్య గురించి కూడా ఈమె మాట్లాడారు.
పరిటాల రవి హత్య కేసులో జగన్ ప్రమేయం ఉందంటూ ఈమె మాట్లాడారు. తోపుదుర్తి బ్రదర్స్ రెచ్చగొట్టడం వల్లే గతంలో ఎన్నో అన్యాయాలు జరిగాయని మీ కారణంగా పరిటాల, మద్దెల చెరువు సూరి కుటుంబం, సానే కుటుంబాలలో అన్యాయం జరిగాయని ఈమె గత విషయాల గురించి మాట్లాడారు.
ఇలా వీరిద్దరి మధ్య వివాదాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలోకి ఎంట్రీ ఇచ్చారు. తానే స్వయంగా పాపిరెడ్డి పల్లికి వచ్చి లింగమయ్య కుటుంబాన్ని పరామర్శిస్తానని చెప్పడంతో ఇది కాస్త సంచలనంగా మారింది.జగన్ ఎవరో చెప్పిన మాటలు విని జిల్లాకు రావడం కాదని, కేవలం లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడమే కాకుండా… గత గత ఐదేళ్లలో తోపుదుర్తి బ్రదర్స్ బాధితులందరినీ పరామర్శించాలి అంటూ సునీత జగన్మోహన్ రెడ్డి పట్ల విమర్శలు కురిపించారు.
ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధిత లింగమయ్య కుటుంబ సభ్యులతో ఫోన్ కాల్ ద్వారా మాట్లాడుతూ వారికి భరోసా ఇవ్వడమే కాకుండా తానే స్వయంగా పాపిరెడ్డి పల్లికి వస్తానని చెప్పడంతో రాప్తాడు రాజకీయం వేడెక్కింది.. మరి జగన్ వచ్చేలోపు ఇక్కడ రాజకీయ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయో తెలియాల్సి ఉంది