ఖరీదైన స్వాంకీ కార్లలో దిగడం కొందరు బాలీవుడ్ స్టార్లకు మాత్రమే సాధ్యం అని భావిస్తాం. ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే, కత్రిన, శ్రద్ధా కపూర్ వంటి స్టార్లు ఖరీదైన హైఎండ్ కార్లలో షికార్ చేయడం తెలిసినదే. ఇప్పుడు నేషనల్ క్రష్ రష్మిక మందన్న వారి సరసన చేరింది.
రష్మిక దాదాపు రూ. 2 కోట్ల విలువైన అద్భుతమైన మెర్సిడెస్-బెంజ్ ఎస్-450ని కొనుగోలు చేసింది. సెలబ్రిటీలు తమ రోల్స్ రాయిస్‌లు, లంబోర్గినిలు – మేబ్యాక్ వంటి ఖరీదైన వెర్షన్ లతో మెరుపులు మెరిపిస్తుంటే, రష్మిక కూడా తన యూనిక్ టేస్ట్ ని ప్రెజెంట్ చేస్తోంది. వెటరన్స్ ఖరీదైన హ్యాబిట్స్ తోను పోటీపడటంలో రష్మిక ఎక్కడా తగ్గడం లేదు. తనవద్ద ఇప్పటికే ఐదు ఖరీదైన లగ్జరీ బ్రాండ్ కార్లు గ్యారేజీలో ఉన్నాయి. కేవలం ఈ కార్ల కోసం కోట్లాది రూపాయలను రష్మిక వెచ్చిస్తోంది. కెరీర్ మ్యాటర్ కి వస్తే .. రష్మిక మందన్న నటించిన సికందర్ ఈద్ కానుకగా విడుదలకు సిద్ధమవుతోంది. సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా నటించగా, తనకంటే 28 ఏళ్ల తక్కువ వయసున్న కథానాయికతో రొమాన్స్ చేయడం చర్చగా మారింది.
28 ఏళ్లకే.. దాదాపు అందరూ స్టార్ హీరోలతోనూ నటించి..టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ చిత్రసీమల్లో గుర్తింపు పొందిన పాన్ ఇండియా స్టార్ రష్మిక. ప్రస్తుతం ఆమె నెట్ వర్త్ గురించి ఒక వార్త తెగ వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటుంది.
రష్మిక ఒక్కో సినిమాకు సుమారు రూ. 4 కోట్లు తీసుకుంటుందని సమాచారం. ‘పుష్ప 2’ సినిమా కోసం ఆమె రూ. 10 కోట్లు పారితోషికంగా అందుకున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌లోనూ పాపులర్ అయిన రష్మిక, ‘గుడ్‌బై’, ‘మిషన్ మజ్ను’, ‘ఆనిమల్’ వంటి సినిమాల్లో కనిపించి మంచి మార్కులు కొట్టేసింది.
సినిమాల కంటే ఎక్కువగా బ్రాండ్ ఎండోర్స్‌మెంట్స్ ద్వారా కూడా రష్మిక భారీగా సంపాదిస్తోంది. బోట్, కాల్యాన్ జువెలర్స్, 7UP, మీషో వంటి ప్రముఖ బ్రాండ్‌లకు ఆమె అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. ఈ ప్రకటనల ద్వారా ఆమె కోట్లు సంపాదిస్తోంది.
రష్మిక మందన్నకు బెంగళూరులో రూ. 8 కోట్ల విలువైన లగ్జరీ బంగ్లా ఉంది. ముంబై, గోవా, కూర్గ్, హైదరాబాద్‌లలోనూ ఆమెకు ప్రాపర్టీలు ఉన్నట్లు తెలుస్తోంది. వీటికి తోడు, ఆమె వృత్తిపరంగా మేకప్ బ్రాండ్ ‘ప్లం’లో పెట్టుబడి పెట్టింది.
లగ్జరీ కార్లపై ఆసక్తి ఉన్న రష్మిక, ఆడి Q3, రేంజ్ రోవర్ స్పోర్ట్, టయోటా ఇన్నోవా, హ్యూండాయ్ క్రెటా, మెర్సిడెస్ బెంజ్ C-క్లాస్ వంటి కార్లను కలిగి ఉంది.