విజయ్ దేవరకొండ-రష్మికా మందన్నా మధ్య ఉన్నది రిలేషన్ షిష్పా? స్నేహమా? అన్న దానిపై ఎన్నో సందేహాలున్నాయి. ‘గీతాగోవిందం’ దగ్గర నుంచి ఇద్దరు ఎంత క్లోజ్ అయ్యారు? అన్నది ప్రతీ సంద ర్భంలోనూ బయట పడుతుందనే ఉంది. అది స్నేహమా? ప్రేమ అన్న దానిపై స్పష్టత రాని పరిస్థితి. ఈ విషయంలో విజయ్- రష్మికలు కూడా ఏనాడు సరైన క్లారిటీ కూడా ఇవ్వలేదు.
దీంతో ఇద్దరి పై ఎప్పటికప్పుడు మీడియా కథనాలు హాట్ టాపిక్ గానే కనిపిస్తున్నాయి. తాజాగా ‘సికిందర్’ రిలీజ్ అనంతరం రష్మిక-విజయ్ ఇద్దరు మళ్లీ ముంబైలో మీట్ అయ్యారు. ఇద్దరు కలిసి రెస్టారెంట్ లో లంచ్ చేస్తోన్న ఓ పిక్ నెట్టింట వైరల్ అవుతుంది. రష్మిక స్పోర్స్ట్ దుస్తుల్లో కనిపిస్తుంది. విజయ్ షర్ట్ అండ్ ప్యాంట్ లో ఆమెకు ఎదురుగా కూర్చుని ఉండటం గమనించొచ్చు. ఇద్దరు మాట్లాడుకుంటూ లంచ్ చేస్తున్నారు.
తొలుత రష్మిక రెస్టారెంట్ లోకి ఎంటర్ అయిన వెంటనే అక్కడ అభిమానులకు సెల్పీలు ఇస్తుంది. విజయ్ వెనుక నుంచి వచ్చి రష్మికను థ్రిల్ చేసాడు. మరి ఉన్న పళంగా మీట్ అయిన ఈ లంచ్ వెనుక కహానీ ఏంటో తెలియాలి. సికిందర్ షూటింగ్ మొదలైన నాటి నుంచి రష్మిక క్షణం తీరిక లేకుండా ఉంది. ఓ వైపు ఛావా ప్రచారం పనులు చూసుకుంటూనే సికిందర్ డబ్బింగ్ పనులకు హాజరైంది. ‘ఛావా’ రిలీజ్ అనంతరం ఆ సినిమా సక్సెస్ మీట్..మీడియా మీట్ అంటూ బిజీ అయింది. ఈ లోగా సికిందర్ రిలీజ్ సమయం దగ్గర పడటంతో ఆ సినిమా ప్రచారం పనులు మొదలు పెట్టింది. మార్చి 30న ` సికిందర్` రిలీజ్ అవ్వడంతో రష్మిక కూడా ప్రీ అయింది. ఈ నేపథ్యంలో విజయ్ తో ముంబైలో మీట్ అయినట్లు తెలుస్తోంది. విజయ్ నటిస్తోన్న` కింగ్ డమ్` షూటింగ్ కూడా ముగింపు దశకు చేరుకోవడంతో సమయం దొరకింది.