నేషనల్ క్రష్ రష్మిక మందన్న వరుస విజయాలను సొంతం చేసుకుంది. యానిమల్, పుష్ప 2, ఛావా సినిమాలతో బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాలను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఇటీవల సల్మాన్ ఖాన్‌తో నటించిన సికిందర్ సినిమా నిరాశ పరచినా కూడా రష్మిక క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఆమె ఓకే చెప్పాలే కానీ బాలీవుడ్ నుంచే కాకుండా అన్ని భాషల సినిమా ఇండస్ట్రీ నుంచి ఒకేసారి అర డజను సినిమా ఆఫర్లు ఆమె ముందు ఉంటాయి. అంతటి క్రేజ్, స్టార్‌డంను దక్కించుకున్న రష్మిక మందన్న ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కొత్తగా అడుగులు వేస్తూ, తనను తాను జనాలకు కొత్తగా చూపించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
ఇప్పటి వరకు ఏ ఇండియన్ స్టార్ కూడా భాగస్వామ్యం కాని టెర్రిబ్లీ టైనీ టేల్స్‌తో జత కలిసింది. ఇండియాలో వారిని పరిచయం చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. ఒక ఆసక్తికర పోస్ట్‌ను షేర్ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. చిన్న చిన్న కథలు చెప్పడం కోసం తాను ఎప్పుడూ ఆసక్తిగా ఉంటాను అని, అయితే ఆ కథలను చెప్పడం అనేది టెర్రిబ్లీ టైనీ టేల్స్ ద్వారా చాలా ఈజీ అంటూ రష్మిక మందన్న చెప్పుకొచ్చింది. తన సొంత స్టోరీ ఒకటి క్రియేట్ చేసి యానిమేటెడ్ అవతార్‌లతో రష్మిక షేర్ చేసింది. ఆ పోస్ట్‌లో ఉన్నది విజయ్ దేవరకొండ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు.
మొత్తానికి సినిమా ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకు పోతున్న రష్మిక మందన్న సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. మిలియన్‌ల కొద్ది ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న రష్మిక మందన్న ఎన్నో కమర్షియల్ యాడ్స్‌లో నటించడం ద్వారా, పలు బ్రాండ్స్‌కి అంబాసిడర్‌గా వ్యవహరించడం ద్వారా కోట్ల రూపాలయను సొంతం చేసుకుంటున్న విషయం తెల్సిందే. ఇప్పుడు కొత్త జర్నీని మొదలు పెట్టి రష్మిక ఎంతో మంది సెలబ్రెటీలకు మార్గం సుగమం చేసింది. ఈమధ్య కాలంలో టైనీ టేల్స్ అనేది బాగా పాపులారిటీని సొంతం చేసుకున్నాయి. అందుకే రష్మిక ఈ దారిలో నడిచేందుకు గాను గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంటుందని సమాచారం.
సికిందర్ సినిమాతో నిరాశ పరచిన రష్మిక మందన్న ఇదే ఏడాదిలో కుబేరా, ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా రూపొందిన కుబేరా సినిమా విడుదలకు ముస్తాభవుతోంది. ఇప్పటికే సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలు అయ్యాయి. నాగార్జున కీలక పాత్రలో నటించడం ద్వారా ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. రష్మిక మందన్న హీరోయిన్ ఓరియంటెడ్ కాన్సెప్ట్‌తో ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో రాబోతుంది. ఆ సినిమా నుంచి వచ్చిన టీజర్ సినిమా స్థాయిని పెంచింది. ఈ రెండు సినిమాల విజయంతో రష్మిక మరోసారి తన సత్తా చాటబోతుంది. ఒకటి రెండు హిందీ ప్రాజెక్ట్‌లకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. వాటిపై స్పష్టత రావాల్సి ఉంది.